Poorna: శ్రీ మహాలక్ష్మి సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది పూర్ణ. అయితే అవును చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత ఆమెకు మంచి ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ ఉన్నట్లుండి ఆమె చిన్న చిన్న పాత్రలకే పరిమితం అయ్యింది. అయితే ఈటీవీలో ప్రసారం అవుతున్న డ్యాన్స్ రియాలిటీ షో ఢీకు జడ్జ్‌గా వ్యవహరిస్తోన్న పూర్ణ.. ఇప్పుడు మళ్లీ బిజీ అవుతున్నారు. గత నెల విడుదలైన రాజ్ తరుణ్ పవర్ ప్లేలో విలన్‌గా నటించి మెప్పించింది ఈ నటి. ఇప్పుడు ఆమెకు తెలుగులో మరిన్ని ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తాజాగా స్టార్ నటుడు వెంకటేష్ నటించనున్న దృశ్యంలో ఒక పాత్ర కోసం పూర్ణను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
మలయాళంలో విజయం సాధించిన దృశ్యం 2ను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ నెలలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఇందులో ఒక పాత్ర కోసం పూర్ణను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ మాతృకలో మోహన్ లాల్ ఇంటి దగ్గర ఒక జంట ఉంటుంది. ఆ పాత్రల కోసం రానా, పూర్ణలను అనుకుంటున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
కాగా పూర్ణ ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణ- బోయపాటి మూవీలో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే సుందరి, బ్యాక్ డోర్, తెలుగులో నాకు నచ్చని పదం ప్రేమలో నటిస్తోంది. ఇక జయలలిత జీవిత కథ ఆధారంగా తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ తెరకెక్కించిన తలైవి చిత్రంలో వీకే శశికళ పాత్రలో నటించారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Poorna (Shamna Kasim)