హోమ్ /వార్తలు /సినిమా /

Deepika Pilli: పొట్టి దుస్తుల్లో దీపికా పిల్లి మాస్ డాన్స్.. ఓ ఊపు ఊపేసిన బ్యూటీ! వీడియో వైరల్

Deepika Pilli: పొట్టి దుస్తుల్లో దీపికా పిల్లి మాస్ డాన్స్.. ఓ ఊపు ఊపేసిన బ్యూటీ! వీడియో వైరల్

Photo Twitter

Photo Twitter

Deepika Pilli Latest Dance video: సామాజిక మాధ్యమాలను ఫుల్లుగా వాడేస్తూ అమాంతం ఫాలోయింగ్ పెంచుకుంటోంది దీపికా పిల్లి. ఇంటర్నెట్‌లో ఈ బ్యూటీ చేసే రచ్చ అంతా ఇంతా అని చెప్పలేం. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...

టిక్‌ టాక్‌ (Tik Tok) యాప్‌ వాడకంతో ఎంతో మంది సూపర్ స్టార్స్ అయ్యారు. ఒకవిధంగా తమ తమ టాలెంట్ బయటపెట్టేందుకు టిక్‌టాక్‌ యాప్‌ బాగానే ఉపయోగపడింది. అలా టిక్‌ టాక్‌తో జనం నోళ్ళలో నానుతూ పాపులర్ అయిన వారిలో దీపికా పిల్లి (Deepika Pilli) ఒకరు. ఇదే ఇమేజ్ ఆమెకు `ఢీ` షోలో ఆఫర్‌ వచ్చేలా చేసింది. ఈ టీవీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఈ ఆఫర్ రావడంతో దీపికా క్రేజ్ ఒక్కసారిగా రెట్టింపయింది. దీనికి తోడు సామాజిక మాధ్యమాలను (Social Media) ఫుల్లుగా వాడేస్తూ ఇంకాస్త ఫాలోయింగ్ పెంచుకుంది ఈ బ్యూటీ. ఇంటర్నెట్‌లో దీపికా చేసే రచ్చ అంతా ఇంతా అని చెప్పలేం. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

టీవీ షోస్‌తో స్పెషల్ ఈవెంట్స్ హోస్ట్ చేస్తూ దీపికా పిల్లి సూపర్ ఫామ్‌లో ఉంది. కెమెరా ముందు తనదైన క్యూట్ పర్‌ఫార్‌మెన్స్‌తో ఆకట్టుకునే ఈ బ్యూటీ.. జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదితో చేసే రొమాంటిక్ మూమెంట్స్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యాయి. అలా అలా ఇప్పటికే స్టార్ యాంకర్స్‌గా ఎదిగిన రష్మీ గౌతమ్, అనసూయ వరుసలో దీపికా కూడా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ బ్యూటీ కొంటె చూపులు, ముద్దు ముద్దు మాటలు అందరికీ బాగా కనెక్ట్ అవుతుంటాయి. ఈ రకంగా అమ్మడికి సోషల్‌ మీడియాలో క్రేజ్‌ పెరిగిపోయింది.

ఇంటర్నెట్‌లోకి వచ్చిన అనతి కాలంలోనే దీపికా పిల్లికి భారీ ఫాలోయింగ్‌ ఏర్పడింది. దీంతో ఆ ఫాలోయింగ్ రెట్టింపయ్యేలా ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్, వీడియోలతో మెస్మరైజ్ చేస్తుంటుంది దీపికా. ఇందులో భాగంగా తాజాగా ఓ డాన్స్ వీడియో (Deepika Pilli Dance video) వదిలింది. ఈ వీడియోలో పొట్టి బట్టలేసుకుని కనిపిస్తున్న దీపికా.. తన డాన్స్ పర్‌ఫార్‌మెన్స్‌తో ఓ ఊపు ఊపేసింది. ఆమె ఎనర్జీ లెవెల్స్ చూసి షాకవుతున్నారు నెటిజన్లు.


అనిరుధ్ ర‌విచంద్ర‌న్ మ్యూజిక్ అందించిన టూ టు సాంగ్‌కి బ్రింజ‌ల్ క‌ల‌ర్ పొట్టి గౌనులో క్యూట్ లుక్స్‌తో డ్యాన్స్ చేస్తూ అందాల విందు చేసింది దీపికా పిల్లి. దీంతో ఈ వీడియోపై లైకుల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ఇకపోతే ఈ సూపర్ హాట్ వీడియోని చూసి మురిసిపోతున్న నెటిజన్లు బ్యూటిఫుల్ డాన్స్, సో క్యూట్, వాటే ఎనర్జీ, ఫైరింగ్ బ్యూటీ, ల‌వ్యూ బేబీ అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఈ వీడియో దీపికా క్రేజ్‌ని ఓ మెట్టు ఎక్కించిందనే చెప్పుకోవాలి.

Published by:Sunil Boddula
First published:

Tags: Deepika pilli, Deepika Pilli dance, Dhee show

ఉత్తమ కథలు