Home /News /movies /

DHEE CHAMPIONS QUARTER FINALS SUDHEER FANS GOT ANGRY RASHMI FRUSTRATED MK

Dhee షోలో సుడిగాలి సుధీర్‌కు ఘోర అవమానం...తట్టుకోలేక...వెక్కి వెక్కి ఏడ్చిన రష్మీ, ప్రియమణి...

సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్ (sudigali sudheer rashmi gautam)

సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్ (sudigali sudheer rashmi gautam)

ఈ షోలో సుడిగాలి సుధీర్ ను చాలా అవమానకరంగా చూపించడంతో అతడి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ముఖ్యంగా సుధీర్ ను ఒక విచిత్రమైన వేషం వేయిండం ద్వారా అతడి కేరక్టర్ ను మరింత బ్యాడ్ చేయాలనే తపన అటు నిర్వాహకుల్లో ఉందని సోషల్ మీడియాలో అతడి ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ఇంకా చదవండి ...
    బుల్లితెర మీద సంచలనాలు సృష్టిస్తున్న ప్రోగ్రాం ఏదైనా ఉందంటే అది ఢీ షో అనే చెప్పాలి. ఇప్పటికే ఈ షో స్టార్ట్ అయ్యి 12 సంవత్సరాలు దాటిపోయినా, ప్రతీ సీజన్ లోనూ ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తో ముందుకు వస్తోంది. అయితే ఫ్రస్తుతం డీ చాంపియన్స్ క్వార్టర్ ఫైనల్ స్థాయి వరకూ వచ్చేసింది. ఈ క్వార్టర్ ఫైనల్స్ లో డ్యాన్సర్లు అంతా ప్రాణం పెట్టి డాన్స్ చేసేశారు. అటు సుధీర్-రష్మిలుకూడా ఈ షోకు ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి. వీళ్లకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కెమిస్ట్రీ పండించడంలో వీళ్లే తర్వాతే ఎవరైనా. నిజానికి సుధీర్ అనే పేరు వినిపించగానే రష్మీ గుర్తువస్తుంది. అలాగే రష్మీ టాపిక్ వస్తే అందులో కచ్చితంగా సుధీర్ గురించి ప్రస్తావన వస్తుంది. ఇంతలా అందరినీ ఈ జంట ఆకట్టుకుంటోంది. ఇక ఈ జంట జబర్దస్త్‌లోనే కాకుండా ఢీ లో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ షోలో సుడిగాలి సుధీర్ ను చాలా అవమానకరంగా చూపించడంతో అతడి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ముఖ్యంగా సుధీర్ ను ఒక విచిత్రమైన వేషం వేయిండం ద్వారా అతడి కేరక్టర్ ను మరింత బ్యాడ్ చేయాలనే తపన అటు నిర్వాహకుల్లో ఉందని సోషల్ మీడియాలో అతడి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ముఖ్యంగా సుదీర్ ను మొదటి నుంచి డీగ్రేడ్ చేయాలని అటు యాంకర్ ప్రదీప్ ప్రయత్నం చేస్తున్నారని, అటు సుధీర్ ఫ్యాన్స్ మొదట అనుమానం వ్యక్తం చేస్తున్నారు.



    క్వార్టర్ ఫైనల్స్ కు సంబంధించిన ప్రోమో ఇఫ్పటికే యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నప్పటికీ సుధీర్ ఫ్యాన్స్ మాత్రం హర్ట్ అవుతున్నారు. సుధీర్ ఇలాంటివి సహించడం మానేయాలని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు రష్మీ కూడా నిర్వాహకులపై ఫైర్ అయినట్లు తెలుస్తోంది. అయితే హైపర్ ఆది మాత్రం ఈ ఎపిసోడ్ లో కాస్త ఎక్కువగానే ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  అయితే ఈ ప్రోమోలో అటు రష్మీ, ప్రియమణి కూడా చివర్లో వెక్కి వెక్కి ఏడ్చినట్లు చూపించారు. దీంతో ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Dhee Dance Reality Show, Sudigali sudheer

    తదుపరి వార్తలు