DHEE CHAMPIONS LATEST PROMO GOING VIRAL IN SOCIAL MEDIA AND SUDHEER DANCE SUPERB PK
సుడిగాలి సుధీర్, హైపర్ ఆది రచ్చ.. ఆ ప్రోమో ఇప్పుడు వైరల్..
సుడిగాలి సుధీర్,హైపర్ ఆది (Sudigali Sudheer Hyper Aadi)
Sudigali Sudheer Hyper Aadi: బుల్లితెరపై కొన్ని షోలకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. వాటికి సంబంధించిన ప్రోమోలు కానీ.. స్కిట్స్ కానీ యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేయగానే..
బుల్లితెరపై కొన్ని షోలకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. వాటికి సంబంధించిన ప్రోమోలు కానీ.. స్కిట్స్ కానీ యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేయగానే విపరీతమైన వ్యూస్ వచ్చేస్తుంటాయి. అలాంటి షోనే ఢీ ఛాంపియన్స్ కూడా. ఈటీవీలో వచ్చే ఈ షో గురించి చెప్పనక్కర్లేదు. దీన్నుంచే చాలా మంది కొరియోగ్రఫర్స్ ఇండస్ట్రీకి వచ్చారు. ఇదిలా ఉంటే ప్రతీ వారం వచ్చే ఢీ షోకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది. ఇందులోంచి ప్రోమో విడుదలైనా.. స్కిట్స్ విడుదలైన రచ్చ చేస్తుంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది.
తాజాగా ఢీ ఛాంపియన్స్ ప్రోమో విడుదలైనప్పటి నుంచి నెంబర్ 1 ట్రెండింగ్‌లో ఉంది. ఆగస్ట్ 5 ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల చేసారు మల్లెమాల. అందులో మీ బావగారు వచ్చేటి వేల అంటూ డాన్సులతో కుమ్మేసారు సుధీర్, హైపర్ ఆది. అందులో టిక్ టాక్ దుర్గారావును కూడా వాడేసుకున్నారు. అసలు విషయం ఏంటంటే.. కొరియోగ్రఫర్ కమ్ డాన్సర్ పండు ఈ పాటకు లేడీ గెటప్‌లో స్టెప్పులేసాడు.
హైపర్ ఆది వర్షిణి మధ్య రొమాన్స్ (hyper aadi varshini)
అది కాస్తా సూపర్ వైరల్ అయిపోయింది. దానికి సుధీర్, హైపర్ ఆది కూడా ఎక్స్ ట్రా యాడ్ అప్ ఇచ్చారు. వాళ్లు కూడా డాన్సులు చేయడంతో పాటు కామెడీ కూడా ఇరక్కొట్టేసారు. దాంతో ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ కాదు దాని మమ్మీ అయిపోయింది. ఇప్పటికే 11 మిలియన్స్ వ్యూస్ సాధించిన ఈ ప్రోమో.. యూ ట్యూబ్‌లో నెంబర్ 1 ట్రెండింగ్‌లో ఉంది.
వరసగా రెండో రోజు కూడా నెంబర్ 1గానే ఉంది ఈ ప్రోమో. కచ్చితంగా ఈ ఎపిసోడ్ రేటింగ్ కూడా పేలిపోయేలా కనిపిస్తుంది. ఈ ఒక్క పాటతోనే షో రేంజ్ పెంచేసారు కొరియోగ్రఫర్స్ కూడా. దానికి తోడు సుధీర్ డాన్స్ కూడా అదనపు ఆకర్షణ. మొత్తానికి ఈ ఢీ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తూ దూసుకుపోతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.