Sekhar Master- Rashmi Gautam- Deepika Pilli: తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే బిగ్టెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోలలో ఢీ ఒకటి. ఈటీవీలో ప్రసారం అయ్యే ఈ షో ప్రస్తుతం 13వ సీజన్‌ని జరుపుకుంటోంది. కింగ్స్ వర్సెస్ క్వీన్స్‌గా సాగుతున్న ఈ సీజన్‌కు శేఖర్ మాస్టర్, సంగీత, పూర్ణ జడ్జిలుగా ఉన్నారు. అబ్బాయిల వైపు మెంటర్లుగా సుధీర్, ఆది ఉండగా.. అమ్మాయిల వైపు రష్మి, దీపిక ఉన్నారు. ప్రదీప్ వ్యాఖ్యతగా ఉన్నారు. ఇక ఈ షోలో తమ డ్యాన్స్‌లతో కంటెస్టెంట్‌లు అదరగొట్లేస్తున్నారు. కాగా ఈ షోకు సంబంధించి వచ్చే వారం ప్రోమోను తాజాగా విడుదల చేశారు. అందులో లేడి కంటెస్టెంట్ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డిలోని మధురమే ఈ క్షణమే పాటకు స్టెప్పులు వేశారు. ఇక అదే పాటకు శేఖర్ మాస్టర్.. రష్మి, దీపికాలతో రొమాన్స్ చేశారు.
రొమాంటిక్ పాటకు.. ఆ ఇద్దరితో హాట్ స్టెప్పులు వేస్తూ స్టేజ్‌పైనే రెచ్చిపోయారు. ఇక రష్మి, దీపికా కూడా అంతే హాట్‌గా స్టెప్పులు వేయడం విశేషం. మొత్తానికి ఈ పాటతో స్టేజ్‌ని వేడెక్కించారు ఈ ముగ్గురు. ఇక మాస్టర్ డ్యాన్స్‌కు హైపర్ ఆది కౌంటర్ ఇచ్చారు. పాట ఆపకపోతే మరో పండుగ వచ్చే వరకు ఆయన స్టెప్పులు వేస్తూనే ఉంటాడని ఆది అన్నాడు.
ఇక సంగీత సైతం తన ఖడ్గం చిత్రంలోని అహ అల్లరి అల్లరి చూపులతో పాటకు అదిరిపోయే డ్యాన్స్ వేసింది. ఆమె డ్యాన్స్ వేసే సమయంలో పూర్ణ, రష్మి, దీపికా కూడా సహకారం అందించారు. ఇక ఎప్పటిలాగే సుధీర్, ఆదిలపై ప్రదీప్ వేసే పంచ్‌లు ప్రోమోలో ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ప్రోమోను చూస్తుంటే వచ్చే వారం వీక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉండబోతున్నట్లు అర్థమవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.