Aqsa Khan: డాన్సర్ పండుతో బ్రేకప్ చెప్పేసిన అక్సాఖాన్...కారణాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు...

Aqsa khan with Pandu Photo : Instagram

డాన్సర్ పండు సైతం అక్సాఖాన్ కోసం చాలా ప్లాన్స్ వేస్తున్నాడు. అయితే అటు ఫ్యాన్స్ కూడా వీరిద్దరి జోడీకి చాలా మద్దతుగా నిలుస్తున్నారు. పండు ఇకపై ఒంటరివాడు కాదని అతడి వెనుక అక్సాఖాన్ నిలిచిందని గుర్తు చేస్తున్నారు.

  • Share this:
    ఢీ షోలో కెరీర్ ప్రారంభించి ఎంతో మంది డాన్సర్లు నేడు స్టార్ స్టేటస్ అందుకున్నారు..అలాంటి వారిలో అక్సా ఖాన్ ఒకరు. స్వింగ్ జర..స్వింగ్ జర సాంగ్ తో ఢీ 10లో జూనియర్ ఎన్టీఆర్ దుమ్ము దులిపిన అక్సా ఖాన్ అంటే ఓ రేంజ్ స్టార్ గా ఎదిగిపోయింది. ఈ భామ అంటే యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అక్సా ఖాన్ నడుము తిప్పిందంటే చాలు యువత గుండె జారి గల్లంతు కావాల్సిందే. ఢీ 10 ఫైనల్ లో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి స్వింగ్ జరా పాటకు స్టెప్పులు వేయించింది...అక్సాఖాన్. ఢీ షోలో డ్యాన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ గా ఎదిగిన సాయిపల్లవి తరహాలోనే అక్సా కూడా హీరోయిన్ గా చాన్సులు అందుకుంటోంది. సుడిగాలి సుధీర్ అంటే అభిమానించే అక్సా..అతడిని పెళ్లి చేసుకుంటా అంటూ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చి సంచలనం రేపింది. ఇదిలా ఉంటే తాజాగా ఢీ షోలోనే మరో డాన్సర్ పండు, అక్సాఖాన్ మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోంది అంటూ వార్తలు గుప్పు మంటున్నాయి. ఢీ జోడీ ద్వారా పరిచయం అయిన ఈ జంట ఒక్కటి కాబోతోందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. మరోవైపు పండు కూడా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాడు. ముఖ్యంగా విశాఖ పట్నంలో ఓ డాన్సింగ్ స్టూడియో కూడా స్థాపించాడు. అంతేకాదు అక్సాఖాన్ కూడా నెమ్మదిగా సినిమాల్లో హీరోయిన్ పాత్రలు దక్కించుకుంటోంది. అక్సాఖాన్ ప్రస్తుతం ఆర్జీవీ అనే ఓ సినిమాలో హీరోయిన్ గా రాణిస్తోంది. అటు పండు కూడా నెమ్మదిగా చాన్స్ లు తెచ్చుకుంటున్నాడు. పండు ప్రస్తుతం జీ తెలుగులో ప్రోగ్రామ్స్ లో రాణిస్తున్నాడు. అయితే పండును ఢీ చాంపియన్స్ షో నుంచి ఎలిమినేట్ చేయడం కూడా అక్సాఖాన్ కు ఏమాత్రం నచ్చలేదు.  ఈ విషయంలో ఆమె చాలా డిజప్పాయింట్ అయ్యింది.

    అంతేకాదు పండు కోసం ఆమె శేఖర్ మాస్టర్ తో ఢీ అంటే ఢీ కొట్టేందుకు సైతం సై అన్నది. అంతేకాదు అతడితో కలిసి ఓ సినిమా సైతం చేసేందుకు సిద్ధం అవుతోంది. అలాగే ఇద్దరూ కలిసి తమ డ్యాన్స్ అకాడమీని స్థాపించి మాస్టర్లుగా మారుందుకు ప్రణాళికలు వేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ సడెన్ గా పండులో వచ్చిన మార్పులను అక్సా ఖాన్ తట్టుకోలేకపోతోందనే టాక్ వినిపిస్తోంది. డాన్సర్ పండు ప్రస్తుతం తనను దూరంగా పెడుతున్నాడని అక్సాఖాన్ తన సన్నిహితులతో వాపోయిందట.

    అయితే వీరిద్దరూ బ్రేకప్ దిశగా అడుగులు వేస్తున్నారని ఫిలింనగర్ లో టాక్ నడుస్తోంది. అయితే నిజం ఏంటన్నది తెలియాల్సి ఉంది.
    Published by:Krishna Adithya
    First published: