హోమ్ /వార్తలు /సినిమా /

Dharma chakram: ధర్మచక్రం ఫస్ట్ లుక్ రిలీజ్.. ఆసక్తి రేపుతున్న కొత్త పోస్టర్!

Dharma chakram: ధర్మచక్రం ఫస్ట్ లుక్ రిలీజ్.. ఆసక్తి రేపుతున్న కొత్త పోస్టర్!

Dharma chakram (Photo Twitter)

Dharma chakram (Photo Twitter)

Dharma chakram first look: ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ధర్మచక్రం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు దర్శకనిర్మాతలు. ఇందులో భాగంగా తాజాగా "ధర్మచక్రం" ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

పద్మ నారాయణ ప్రొడక్షన్ బ్యానర్ లో సంకేత్ తిరుమనీడి, మౌనిక చౌహాన్ జంటగా నాగ్ ముంతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా ధర్మచక్రం. సందేశాత్మక కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. ప్రేక్షకులకు ఓ వినూత్న అనుభూతి కలిగించేలా స్క్రిప్ట్ రాసుకొని అన్ని జాగ్రత్తలతో రూపొందిస్తున్నారట.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు దర్శకనిర్మాతలు. ఇందులో భాగంగా తాజాగా "ధర్మచక్రం" ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. విడుదల చేసిన కాసేపట్లోనే దీనికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఆనంద్ మరుకుర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు.. ప్రణయ్ రాజపూటి సంగీతం అందిస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు నాగ్ ముంతా మాట్లాడుతూ.. ధర్మచక్రం సినిమాను మెసేజ్ ఓరియెంటెడ్ గా తెరకెక్కిస్తున్నాము. సమాజంలో ఆడవాళ్ళపై జరుగుతున్న అఘాయిత్యాలు, ఆకృత్యాల నేపథ్యంలోనే ఈ చిత్ర కథ ఉంటుంది. అమ్మాయిల స్వీయ రక్షణ ఎలా ఉండాలో ఈ సినిమాలో చూపిస్తున్నాము. హీరోయిన్ మోనిక చౌహన్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీ అనౌన్స్ చేస్తాము' అని తెలిపారు.

గతంలో ఇదే ధర్మ చక్రం పేరుహో రెండు సినిమాలు వచ్చాయి. శోభన్ బాబు హీరోగా ఓ సినిమా రాగా, ఆ తర్వాత వెంకటేష్ హీరోగా ధర్మచక్రం వచ్చింది. ఈ సినిమా వెంకీ కెరీర్ లో ఓ మైల్ స్టోన్ కావడంతో మళ్ళీ అదే పేరుతో రాబోతున్న ఈ సినిమాపై జనాల్లో క్యూరియాసిటీ పెరిగింది.

తాజాగా వదిలిన పోస్టర్ చూస్తుంటే ఈ సినిమాలో కాంతారా ఛాయలు ఉంటాయా నే ఫీలింగ్ కలుగుతోంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి జానర్ లో వస్తున్న సినిమాలకు భారీ విజయం దక్కుతుండటంతో ఈ ధర్మచక్రం ఎలా ఉండనుందనే ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో సంకేత్ తిరుమనీడి, మౌనిక చౌహాన్, చైతన్య, ప్రవీణ్ కుమార్, ధృవ, జానీ ఫీవర్ మైలవరం, నరసింహా రావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అతిత్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

First published:

Tags: Cinema, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు