DHANYA BALAKRISHNA ENQUIRY ABOUT SUDIGALI SUDHEER BEFORE COMMITTING SOFTWARE SUDHEER MOVIE MS
సుధీర్ గురించి ఎంక్వైరీ చేసిన హీరోయిన్.. ఏం తేలిందంటే..
సుడిగాలి సుధీర్ (Source: Twitter)
తాను అంతకుముందు నటించిన సినిమాలు జనాల్లోకి వెళ్లకపోవడంతో.. ఈ సినిమాకు జాగ్రత్తలు తప్పలేదన్నారు. అందుకే సుధీర్‌కు ఫ్యాన్ బేస్ ఉందా?.. సుధీర్‌తో సినిమా చేస్తే జనాల్లోకి వెళ్తుందా..? అని ఎంక్వైరీ చేసినట్టు తెలిపారు.
సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన తొలి చిత్రం 'సాఫ్ట్వేర్ సుధీర్'. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణన్ హీరోయిన్గా నటించారు. సినిమా విడుదల నేపథ్యంలో సుధీర్,ధన్య కలిసి వరుసగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఓ తాజా ఇంటర్వ్యూలో ధన్య బాలకృష్ణన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సినిమా ఒప్పుకునే సందర్భంలో సుధీర్ గురించి చిన్నపాటి ఎంక్వైరీ చేసినట్టు తెలిపారు. సుధీర్‌తో సినిమా వర్కౌట్ అవుతుందా? లేదా? అని ఇండస్ట్రీలో కొంతమందిని ఆరా తీశాకే సినిమా కమిట్ అయినట్టు చెప్పారు.
తాను అంతకుముందు నటించిన సినిమాలు జనాల్లోకి వెళ్లకపోవడంతో.. ఈ సినిమాకు జాగ్రత్తలు తప్పలేదన్నారు. అందుకే సుధీర్‌కు ఫ్యాన్ బేస్ ఉందా?.. సుధీర్‌తో సినిమా చేస్తే జనాల్లోకి వెళ్తుందా..? అని ఎంక్వైరీ చేసినట్టు తెలిపారు. కొత్త హీరోలతో సినిమాలు చేస్తే విడుదలయ్యే పరిస్థితి కూడా లేదని.. అందుకే సుధీర్‌తో సినిమాకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. జనాలకు తెలిసిన,ఆదరణ ఉన్న వ్యక్తులతోనే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. తన ఎంక్వైరీలో సుధీర్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ నిజమైనదని తేలడంతో.. సినిమా ఒప్పుకున్నట్టు చెప్పారు.త్వరలో విడుదలయ్యే 'సాఫ్ట్వేర్ సుధీర్' అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందన్నారు.
Published by:Srinivas Mittapalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.