Dhanush : మరో తెలుగు దర్శకుడికి ఓకే చెప్పిన ధనుష్... త్వరలో అధికారిక ప్రకటన..

Dhanush Photo : Twitter

Dhanush : తమిళ స్టార్ హీరో ధనుష్ ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమాకు చేస్తుండగా.. మరో తెలుగు దర్శకుడికి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

  • Share this:
    తమిళ నటుడు ధనుష్  (Dhanush) తెలుగులో ఇప్పటికే ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ధనుష్, శేఖర్ కమ్ముల  (Sekhar Kammula)దర్శకత్వంలో ఓ ప్యాన్ ఇండియా సినిమాను చేస్తున్నారు. దీనికి సంబందించి అధికారిక ప్రకటన విడుదలైంది. ఇక అది అలా ఉంటే ఆయన మరో తెలుగు దర్శకుడితో సినిమాను ఓకే అన్నారని తెలుస్తోంది. “ఆర్ఎక్స్ 100” వంటి సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా మారిన అజయ్ భూపతితో సినిమా చేసేందుకు ధనుష్ కూడా ఒకే చెప్పినట్టు తాజా సమాచారం. అజయ్ భూపతి (Ajay Bhupathi) ప్రస్తుతం శర్వానంద్, సిద్దార్థ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ సినిమా “మహా సముద్రం” (Maha Samudram)ను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత ధనుష్‌తో సినిమా ఉండోచ్చని అంటున్నారు.

    ధనుష్ స్వయంగా అజయ్ భూపతిని పిలిపించుకుని కథ ఉంటే చెప్పమన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అజయ్ భూపతి చెప్పిన కథ ధనుష్‌కు కూడా నచ్చడంతో సినిమా ఓకే అయ్యిందని సమాచారం. ఈ విషయంలో అధికారిక ప్రకటన విడుదలకావాల్సి ఉంది.

    ఇక ధనుష్ శేఖర్ కమ్ముల సినిమా విషయానికి వస్తే.. సున్నిత అంశాలతో ప్రేమకథ చిత్రాలను రూపోందించే శేఖర్ కమ్ముల ధనుష్‌ను ఎలాంటీ కథతో, అసలు ఏ నేపథ్యంలో చూపబోతున్నారన్న ఆసక్తి ధనుష్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులకు ఉంది. మామూలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా అనగానే ఆ చిత్రం లవ్ జానర్‌లోనే ఉంటుందని దాదాపు అందరూ అనుకుంటారు. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ తాజా సినిమా పొలిటికల్ డ్రామాగా వస్తోందని తెలుస్తోంది. ఈ సినిమా ఒకప్పటి మద్రాసు నేపథ్యంలో సాగే పీరియడ్ డ్రామాగా టాక్ నడుస్తోందట.

    ఆ కారణంగానే శేఖర్ కమ్ముల ఈ సినిమా కోసం మొదట ధనుష్‌ని సంప్రదించినట్టు సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్‌ వర్క్స్ కూడా దాదాపు పూర్తైనట్టు సమాచారం.నారాయణదాస్‌ నారంగ్, పుస్కూరు రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్నారు.

    ధ‌నుష్ నేపథ్యం విషయానికి వస్తే.. ఆయన విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ధనుష్ సామాన్యుల జీవితాలను తెరపై చర్చిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. మన తెలుగు హీరోల వలే మూస పాత్రలు కాకుండా సాధారణ మనషుల జీవితాలనే కథా వస్తువుగా మలుచుకుంటూ కమర్షియల్ పంథాలో కూడా అదరగొడుతున్నారు ధనుష్. అందులో భాగంగా వచ్చినవే.. అసురన్, కర్ణన్ సినిమాలు. దాదాపు ఆయన సినిమాలన్ని సామాన్యుల జీవితాల గురించే చర్చిస్తాయి.

    ఇక శేఖర్ కమ్ముల సినిమాల విషయానికి వస్తే.. సునిశితమైన కథలతో సహజ సన్నివేశాలతో మనసులను హత్తుకునే మాటలతో మంచి కాఫీ లాంటీ చిత్రాలను తీస్తూ తెలుగువారి హృదయాలను దోచుకుంటున్నారు. అందులో భాగంగా ఆయన ప్రస్తుతం ఆయన లవ్ స్టోరి  (Love Story) అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

    సాయి పల్లవి, (Sai Pallavi) నాగ చైతన్యలు (Naga chaitanya) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకావాల్సి ఉండగా.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఏపీలో టికెట్స్ రేట్స్ కారణంగా ఈ సినిమా త్వరలో ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదలకానుందని తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
    Published by:Suresh Rachamalla
    First published: