Home /News /movies /

DHANUSH TO DO A TELUGU TAMIL FILM WITH SEKAR KAMMULA OFFICIAL ANNOUNCEMENT RELEASED SR

Dhanush | Sekhar Kammula : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్.. అధికారిక ప్రకటన..

Dhanush and Sekhar Kammula Photo : Twitter

Dhanush and Sekhar Kammula Photo : Twitter

Dhanush | ధ‌నుష్.. ఎప్పుటికప్పుడు వైవిధ్య‌మైన కథలతో ముఖ్యంగా సామాన్యుల జీవితాలను తెరపై చర్చిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు.

    ధ‌నుష్.. ఎప్పుటికప్పుడు వైవిధ్య‌మైన కథలతో ముఖ్యంగా సామాన్యుల జీవితాలను తెరపై చర్చిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. మన తెలుగు హీరోల వలే మూస పాత్రలు కాకుండా సాధారణ మనషుల జీవితాలనే కథా వస్తువుగా మలుచుకుంటూ కమర్షియల్ పంథాలో కూడా అదరగొడుతున్నారు ధనుష్. ఇక్కడ మరో విషయం ఏమంటే తెలుగు సినీ స్టార్స్ కంటే తమిళ సినీ స్టార్స్‌కు కొంత సామాజిక సృహ, సమాజం పట్ల సోయి ఎక్కువ. అందుకే అక్కడ ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా సామాజిక కోణంలో సినిమాల వస్తుంటాయి. ఇక తాజాగా ధనుష్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం కర్ణన్. ఈ సినిమా కూడా సామాన్యుల జీవితాలను చర్చిస్తుంది. ఇక అది అలా ఉంటే ధనుష్ మొదటిసారి తెలుగు తమిళ హిందీ భాషాల్లో ఓ సినిమాను తెలుగు దర్శకుడితో చేయనున్నారు. ధనుష్ తెలుగు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నారాయణ దాస్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఇక ధనుష్ నటిస్తున్న ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ధనుష్ నటించిన జగమే తంతీరం తెలుగు తమిళ హిందీ భాషాలతో పాటు ఒకేసారి 17 భాషల్లో ఈరోజు నుండి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది. ఈ సినిమాను కార్తీక్ సుబ్బారాజ్ డైరెక్ట్ చేశారు. దీంతో ధనుష్ తాజాగా హాలీవుడ్ ఫిలిమ్ కూడా చేస్తున్నారు.

    ఇక శేఖర్ కమ్ముల విషయానికి వస్తే.. సునిశితమైన కథలతో సహజ సన్నివేశాలతో మనసులను హత్తుకునే మాటలతో మంచి కాఫీ లాంటీ చిత్రాలను తీస్తూ తెలుగువారి హృదయాలను దోచుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన లవ్ స్టోరి అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. సాయి పల్లవి, నాగ చైతన్యలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకావాల్సి ఉండగా..
    కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా జూలై లేదా ఆగస్టులో విడుదలయ్యే అవకాశం ఉంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Dhanush, Sekhar kammula, Tollywood news

    తదుపరి వార్తలు