ధనుష్.. ఎప్పుటికప్పుడు వైవిధ్యమైన కథలతో ముఖ్యంగా సామాన్యుల జీవితాలను తెరపై చర్చిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. మన తెలుగు హీరోల వలే మూస పాత్రలు కాకుండా సాధారణ మనషుల జీవితాలనే కథా వస్తువుగా మలుచుకుంటూ కమర్షియల్ పంథాలో కూడా అదరగొడుతుంటాడు ధనుష్. ఇక్కడ మరో విషయం ఏమంటే తెలుగు సినీ స్టార్స్ కంటే తమిళ సినీ స్టార్స్‌కు కొంత సామాజిక సృహ, సమాజం పట్ల సోయి ఎక్కువ. అందుకే అక్కడ ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా సామాజిక కోణంలో సినిమాల వస్తుంటాయి. ఉదాహారణకు చిరంజీవి చేసిన ఖైదీ నెం150 గానీ, ఆయన గతంలో చేసిన ఠాగూర్ గానీ, లేదా ప్రస్తుతం వెంకటేష్ చేస్తున్న నారప్ప ఇవన్ని తమిళ సినిమాలకు రీమేక్‌లుగా వచ్చినవే.. ఇలా ఎన్నో చెప్పోచ్చు. మన తెలుగులో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం కూడా ఆ కోవలోనిదే. మన దగ్గర అప్పట్లో దాసరి నారాయణ, టి కృష్ణ లాంటీ వారు ఈ నేపథ్యంలో సినిమాలు తీశారు. ఇప్పుడు అలాంటీ దర్శకులు చాలా తక్కువ. కానీ ఈ కొరత తమిళ్లో కనపడదు. చెప్పాలంటే దర్శకుడు వెట్రిమారన్ సినిమాలన్ని ఈ కోవలోకే వస్తుంటాయి. ఆయన తాజా సినిమా అసురన్.. ధనుష్ హీరోగా వచ్చి అక్కడ బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పుటికే నాలుగైదు సినిమాలు వచ్చాయి. అన్నీ సినిమాలు ప్రేక్షకాదరణను పొందాయి. అలా ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్లో ‘వడచెన్నై’ ఒకటి. ఈ సినిమాలో ధనుష్, ఐశ్వర్యా రాజేష్, ఆండ్రియా, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘వడచెన్నై 2’ రూపొందనుందనేది తాజా సమాచారం. ఈ సీక్వెల్‌ను వెబ్‌సిరీస్‌గా తీసే ఆలోచనలో ఉన్నాడట వెట్రిమారన్.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.