Dhanush | Sekhar Kammula : డిసెంబర్‌లో మొదలుకానున్న ధనుష్ శేఖర్ కమ్ముల చిత్రం షూటింగ్..

Dhanush Sekhar Kammula Photo : Twitter

Dhanush | Sekhar Kammula : తమిళ స్టార్ హీరో ధ‌నుష్ తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే..

  • Share this:
    తమిళ స్టార్ హీరో ధ‌నుష్ విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయన సామాన్యుల జీవితాలను తెరపై చర్చిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. మన తెలుగు హీరోల వలే మూస పాత్రలు కాకుండా సాధారణ మనషుల జీవితాలనే కథా వస్తువుగా మలుచుకుంటూ కమర్షియల్ పంథాలో కూడా అదరగొడుతున్నారు ధనుష్. ఇక అది అలా ఉంటే ధనుష్ ఇప్పటివరకు డైరెక్ట్‌గా తెలుగు సినిమాని కానీ, తెలుగు దర్శకులతో కానీ సినిమా చేయలేదు. ఆయన శేఖర్ కమ్ములతో ఓ పాన్ ఇండియా సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభిచాలని చిత్రబృందం చూస్తోందట. శేఖర్ కమ్ముల ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నారాయణ దాస్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవి నటిస్తున్నట్లు టాక్. ఇక ధనుష్ నటించిన ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ధనుష్ నటించిన జగమే తంతీరం తెలుగు తమిళ హిందీ భాషాలతో పాటు ఒకేసారి 17 భాషల్లో ఇటీవల నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయ్యి ఓకే అనిపించుకుంది. ఈ సినిమాను కార్తీక్ సుబ్బారాజ్ డైరెక్ట్ చేశారు. దీంతో ధనుష్ తాజాగా హాలీవుడ్ ఫిలిమ్ కూడా చేస్తున్నారు.

    ఇక తాజాగా ధనుష్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం కర్ణన్. ఈ సినిమా కూడా సామాన్యుల జీవితాలను చర్చిస్తుంది. కర్ణన్ తమిళంలో మంచి విజయాన్నిఅందుకుంది. ఈ సినిమాను తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్నారు. ఇక ధనుష్ సూపర్ హిట్ చిత్రం అసురన్‌ను తెలుగులో వెంకటేష్ హీరోగా నారప్ప పేరుతో వస్తుంది. ఈ సినిమా ఈ నెల 20 నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది.

    ఇక శేఖర్ కమ్ముల విషయానికి వస్తే.. సునిశితమైన కథలతో సహజ సన్నివేశాలతో మనసులను హత్తుకునే మాటలతో మంచి కాఫీ లాంటీ చిత్రాలను తీస్తూ తెలుగువారి హృదయాలను దోచుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన లవ్ స్టోరి అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. సాయి పల్లవి, నాగ చైతన్యలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకావాల్సి ఉండగా..
    కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా ఆగస్టులో విడుదలయ్యే అవకాశం ఉంది.
    Published by:Suresh Rachamalla
    First published: