Dhanush | Sekhar Kammula : ధనుష్ కోసం శేఖర్ కమ్ముల మొదటి సారి అలాంటీ కథతో వస్తున్నారా...

Dhanush Sekhar Kammula Photo : Twitter

Dhanush | Sekhar Kammula : ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో ఓ ప్యాన్ ఇండియా వస్తున్నట్లు ఇటీవల ఓ ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే.

 • Share this:
  ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో ఓ ప్యాన్ ఇండియా వస్తున్నట్లు ఇటీవల ఓ ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. సున్నిత అంశాలతో ప్రేమకథ చిత్రాలను రూపోందించే శేఖర్ కమ్ముల ధనుష్‌ను ఎలాంటీ కథతో, అసలు ఏ నేపథ్యంలో చూపబోతున్నారన్న ఆసక్తి ధనుష్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులకు ఉంది. ప్రస్తుతం అదే ఇటు తెలుగుతో పాటు అటు తమిళ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మామూలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా అనగానే ఆ చిత్రం లవ్ జానర్‌లోనే ఉంటుందని దాదాపు అందరూ అనుకున్నారు. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ తాజా సినిమా పొలిటికల్ డ్రామాగా వస్తోందని తెలుస్తోంది. ఈ సినిమా ఒకప్పటి మద్రాసు నేపథ్యంలో సాగే పీరియడ్ డ్రామాగా టాక్ నడుస్తోంది. ఆ కారణంగానే శేఖర్ కమ్ముల ఈ సినిమా కోసం మొదట ధనుష్‌ని సంప్రదించినట్టు సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్‌ వర్క్స్ కూడా దాదాపు పూర్తైనట్టు సమాచారం. ఈ సినిమాను నారాయణదాస్‌ నారంగ్, పుస్కూరు రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్నారు.

  ఇక ఈ సినిమా స్టార్ హీరో ధ‌నుష్ నేపథ్యం విషయానికి వస్తే.. ఆయన విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయన సామాన్యుల జీవితాలను తెరపై చర్చిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. మన తెలుగు హీరోల వలే మూస పాత్రలు కాకుండా సాధారణ మనషుల జీవితాలనే కథా వస్తువుగా మలుచుకుంటూ కమర్షియల్ పంథాలో కూడా అదరగొడుతున్నారు ధనుష్. అందులో భాగంగా వచ్చినవే.. అసురన్, కర్ణన్ సినిమాలు. అంతేందుకు దాదాపు ఆయన సినిమాలన్ని సామాన్యుల గురించే చర్చిస్తాయి. ఇక అది అలా ఉంటే ధనుష్ ఇప్పటివరకు డైరెక్ట్‌గా తెలుగు సినిమాని కానీ, తెలుగు దర్శకులతో కానీ సినిమా చేయలేదు. ఆయన శేఖర్ కమ్ములతో ఓ పాన్ ఇండియా సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవి నటిస్తున్నట్లు టాక్.

  ఇక శేఖర్ కమ్ముల సినిమాల విషయానికి వస్తే.. సునిశితమైన కథలతో సహజ సన్నివేశాలతో మనసులను హత్తుకునే మాటలతో మంచి కాఫీ లాంటీ చిత్రాలను తీస్తూ తెలుగువారి హృదయాలను దోచుకుంటున్నారు. అందులో భాగంగా ఆయన ప్రస్తుతం ఆయన లవ్ స్టోరి అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. సాయి పల్లవి, నాగ చైతన్యలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకావాల్సి ఉండగా.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఏపీలో టికెట్స్ రేట్స్ కారణంగా ఈ సినిమా త్వరలో ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదలకానుందని తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

  ఇవి కూడా చూడండి :

  RRR : అర్ధనగ్నంగా పోజులిచ్చిన ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్ ఆలియా భట్.. పిక్స్ వైరల్..

  Anchor Varshini : బికినీలో యాంకర్ వర్షిణి.. వైరల్ అవుతోన్న ఓల్డ్ పిక్స్..

  Premi Viswanath : బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో మెరిసిపోతున్న వంటలక్క...

  Anchor Vishnupriya : లోదుస్తుల్లో యాంకర్ విష్ణుప్రియ.. వైరల్ అవుతోన్న ఓల్డ్ పిక్స్..
  Published by:Suresh Rachamalla
  First published: