Home /News /movies /

DHANUSH SAI PALLAVI MAARI 2 ROWDY BABY VIDEO SONG COMPLETED 900 MILLION VIEWS IN YOUTUBE PK

Rowdy Baby song: ‘రౌడీ బేబీ’ సాంగ్ మరో రికార్డ్.. 900 మిలియన్స్ పూర్తి..

రౌడీ బేబీ సాంగ్ ఫైల్ ఫోటోస్ (Rowdy Baby video song 900 M)

రౌడీ బేబీ సాంగ్ ఫైల్ ఫోటోస్ (Rowdy Baby video song 900 M)

Rowdy Baby Song: రౌడీ బేబీతో యూ ట్యూబ్ రికార్డులతో పాటు ఇండియన్ పాటల రికార్డులను కూడా తిరగరాస్తుంది. ఇప్పటి వరకు 900 మిలియన్ వ్యూస్ సాధించి యూ ట్యూబ్ రికార్డులను షేక్ చేసింది రౌడీ బేబీ సాంగ్.

వ‌చ్చిండే.. మెల్ల‌మెల్ల‌గా వ‌చ్చిండే.. ఈ పాట తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కుడు ఉండ‌డేమో..? ఫిదా సినిమాలోని ఈ పాట‌కు అంతా ఫిదా అయిపోయారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీకి తోడు సాయిప‌ల్ల‌వి డాన్సుల‌కు నిజంగానే అంతా ఫిదా అయిపోయారు. ఈ పాట యూ ట్యూబ్‌లో ఎన్నో సంచలనాలు సృష్టించింది. సౌత్ ఇండియన్ సినిమా ఇండ‌స్ట్రీలో ఏ సినిమాకు సాధ్యం కాని రికార్డుల మోత మోగించింది వచ్చిండే సాంగ్‌. ఈ రికార్డ్ అందుకోవాలంటే మ‌ళ్లీ ఎన్నాళ్లు ప‌డుతుందో అనుకున్నారు కానీ సాయిప‌ల్ల‌వే వ‌చ్చి ఓన్ రికార్డ్ బ‌ద్ద‌లు కొట్టేసింది. రౌడీ బేబీతో యూ ట్యూబ్ రికార్డులతో పాటు ఇండియన్ పాటల రికార్డులను కూడా తిరగరాస్తుంది.

ఫిదా వచ్చిండే సాంగ్
ఫిదా వచ్చిండే సాంగ్


2017 మొత్తం ఫిదా పాట‌తోనే మార్మోగిపోయింది. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 183 మిలియ‌న్ వ్యూస్ అందుకుని యూ ట్యూబ్‌లో స‌రికొత్త సంచ‌ల‌నాల‌కు తెర‌తీసింది ఫిదా వ‌చ్చిండే పాట‌. ఇప్పుడు ధ‌నుష్ హీరోగా మారి 2లో ఉన్న రౌడీ బేబీ పాట దుమ్ము దులిపేస్తుంది. ఈ పాట కేవ‌లం 2 ఏళ్లలో 900 మిలియ‌న్ వ్యూస్ అందుకుని.. ప్రస్తుతం ఇండియన్ సినిమా రికార్డులన్నీ తన పేర రాసుకుంది. ఇండియాలో సల్మాన్ ఖాన్ టైగర్ జిందా హై స్వాగ్ సే స్వాగత్ పాట 841 మిలియన్స్‌తో రెండో స్థానంలో ఉంది.

ఆ పాట తర్వాత ఇంత వేగంగా హైయ్యస్ట్ వ్యూస్ అందుకున్న పాట రౌడీ బేబీనే. సౌత్ ఇండియ‌న్ ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ పాట‌కు కూడా ఈ స్థాయి వ్యూస్ రాలేదు. ఇప్ప‌టికీ రౌడీ బేబీ పాట‌కు వ్యూస్ వ‌చ్చాయి.. ఇంకా వ‌స్తూనే ఉన్నాయి. ఈ రెండు పాట‌ల్లోనూ సాయిప‌ల్ల‌వి ఉండ‌టం విశేషం. ఈమె డాన్సుల‌కు తోడు ఆ బీట్ కూడా అలాగే ఉండ‌టంతో ఆరు నుంచి అర‌వై వ‌ర‌కు అంతా ఆ పాట‌కు నిజంగానే ఫిదా అయిపోయారు. ఇప్పటి వరకు 900 మిలియన్ వ్యూస్ సాధించి యూ ట్యూబ్ రికార్డుల్లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది రౌడీ బేబీ సాంగ్.

రౌడీ బేబీ సాంగ్ ఫైల్ ఫోటోస్ (Rowdy Baby video song 800 M)
రౌడీ బేబీ సాంగ్ ఫైల్ ఫోటోస్ (Rowdy Baby video song 800 M)


ధనుష్ స్వయంగా రాసి.. ఈ పాట పాడాడు. ఈ పాటను యువన్ శంకర్ రాజా స్వరపరిచాడు. ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులను కంపోజ్ చేసాడు ప్రముఖ కొరియోగ్రఫర్ ప్రభుదేవా. జానీ మాస్టర్ కూడా ఈ పాటకు స్టెప్పులు కంపోజ్ చేసాడు. 'రౌడీ బేబీ' వీడియో సాంగ్ రికార్డులను యూ ట్యూబ్ స్వయంగా ప్రకటించడం విశేషం. ఈ సినిమాకు వచ్చిన డబ్బుల కంటే కూడా యూ ట్యూబ్‌లో ఈ పాట చేసిన అరాచకానికి అక్కడ్నుంచి వచ్చిన డబ్బులే అధికంగా ఉంటాయేమో..? 900 మిలియన్స్ అంటే 90 కోట్ల మంది ఈ పాటను చూసారు. అంతగా రౌడీ బేబీ అరాచకాలు చేసింది. ఇదిలాగే ట్రెండ్ కొనసాగితే 1000 మిలియన్ క్రాస్ చేస్తుందేమో..?
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Dhanush, Sai Pallavi, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు