బయోపిక్ చేసేందుకు హీరో ధనుష్ రెడీ.. రజనీకాంత్, ఇళయరాజా పాత్రలంటే ఇష్టమన్న తమిళ స్టార్..
ధనుశ్ (Twitter/Photo)
Dhanush : బయోపిక్‌లో యాక్ట్ చేయడం ఇష్టమే అన్నారు మరో దక్షిణాది నటుడు ధనుష్. రియల్ లైఫ్‌లో ప్రముఖ వ్యక్తులుగా పేరు తెచ్చుకున్న హీరో రజనీకాంత్, మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాత్రలు పోషించాలని ఉందన్నాడు. ధనుష్ బయోపిక్‌తో సక్సెస్ కొడితే ఇదే బాటలోనే మరికొందరు కోలీవుడ్ హీరోలు క్యూ కట్టడం ఖాయం.
తలైవా బయోపిక్ అయితే ఓకే ..
సౌత్‌లో నార్త్‌లో బయోపిక్‌లకు క్రేజ్ పెరుగుతోంది. స్టార్ హీరోలు సైతం ప్రముఖ వ్యక్తుల జీవిత కథల్లో నటించేందుకు పోటీ కడుతున్నారు. ఇదే వరుసలో చేరారు తమిళ యంగ్ స్టార్ ధనుష్. తన అంకుల్ రజనీకాంత్‌తో పాటు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా పాత్రలు చేయడానికి ఇష్ట పడుతున్నారు తమిళ స్టార్ హీరో. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే మామకు తగ్గ అల్లుడిగా పేరు తెచ్చుకున్నారు ధనుష్. మాస్, క్లాస్, ప్రయోగాత్మకమైన పాత్రలు పోషిస్తూ సౌత్‌లో విపరీతమైన పాపులారిటి సొంతం చేసుకున్నాడు. ఇక ఇదే ఫ్యాన్ ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకొని ధనుష్ తన సినీ జర్నీని బాలీవుడ్, టాలీవుడ్‌కి షిప్ట్ చేస్తున్నాడు. బాలీవుడ్లో లేటెస్ట్గా అక్షయ్‌కుమార్, సారా అలీఖాన్‌తో కలిసి "ఆత్రంగారే" అనే మూవీలో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ కోసం ముంబై వెళ్లిన ధనుష్ బయోపిక్‌పై మనసులో మాటను అక్కడ బయటపెట్టారు. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు.
వాళ్లిద్దరంటే నాకెంతో అభిమానం..
టాలీవుడ్, బాలీవుడ్లో స్టార్ హీరోలు చాలా మంది బయోపిక్‌లు చేస్తున్నారు మరీ మీరెప్పుడు చేస్తారన్న ప్రశ్నకు ధనుష్ జవాబిచ్చారు. సినీ పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి తలైవాగా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న రజనీకాంత్, సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ క్రియేట్ చేసుకున్న ఇళయరాజా అంటే తనకు ఎంతో అభిమానమన్నాడు. వాళ్ల పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించేందుకు తాను సిద్దంగా ఉన్నానంటూ హిందీ సినిమా ప్రమోషన్లో క్లారిటీ ఇచ్చాడు హీరో ధనుష్.
బయోపిక్‌లపై ఆసక్తి చూపుతున్న స్టార్స్ ..
ఇప్పటికే బాలీవుడ్లో రణ్‌వీర్‌సింగ్ మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ జీవిత చరిత్రతో తెరకెక్కిన 83 బయోపిక్‌లో యాక్ట్ చేశాడు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ లాల్‌సింగ్ చద్దా కంప్లీట్ చేశాడు. తెలుగులో బ్యాడ్మింటెన్ ప్లేయర్, కోచ్ పుల్లెల గోపిచంద్ బయోపిక్‌లో హీరో సుదీర్‌బాబు కనిపించబోతున్నాడు. బయోపిక్‌లో యాక్ట్ చేయడానికి నేను సైతం రెడీ అని తమిళ స్టార్ ధనుష్ ఇచ్చిన స్టేట్మెంట్తో ఉత్తర, దక్షిణాది ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తలైవా, ఇసైజ్ఞాని పాత్రల్లో ధనుష్ ఎలా ఉంటాడా అని ఊహించుకుంటున్నారు. రజనీ, ఇళయరాజా క్యారెక్టర్లను వెండితెరపై అంతే నాచురల్‌గా చూపించగల టాలెంట్ ఏ డైరెక్టర్‌కి ఉందని చర్చించుకుంటున్నారు అభిమానులు.
టాలీవుడ్పైన కన్నేసిన ధనుష్..
భాషకు పరిమితం కాకుండా అన్నీ వర్గాల, అన్నీ ప్రాంతాల ప్రేక్షకుల అభిమానాన్ని చురగొంటున్న ధనుష్ ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాలు చేసేందుకు సైతం రెడీ అయ్యాడు. టాలీవుడ్లో సాఫ్ట్ డైరెక్టర్‌గా సక్సెస్‌లో దూసుకెళ్తున్న శేఖర్ కమ్ములతో ఓ మూవీ చేస్తున్నాడు ధనుష్. మరో డైరెక్టర్‌తో కూడా స్ట్రెయిట్ తెలుగు సినిమాలో యాక్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ చెన్నై హీరో.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.