లోకల్ బాయ్‌గా ధనుష్... ఫిబ్రవరిలో రానున్నాడు..

అసురన్‌తో అదిరిపోయే హిట్ అందుకున్నాడు ధనుష్‌. ఆ సినిమా తర్వాత ఆయన నుండి వచ్చిన మరో సినిమా పటాస్.

news18-telugu
Updated: January 28, 2020, 10:40 AM IST
లోకల్ బాయ్‌గా ధనుష్... ఫిబ్రవరిలో రానున్నాడు..
Twitter
  • Share this:
అసురన్‌తో అదిరిపోయే హిట్ అందుకున్నాడు ధనుష్‌. ఆ సినిమా తర్వాత ఆయన నుండి వచ్చిన మరో సినిమా పటాస్. సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలైన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తెలుగులో లోకల్ బాయ్ పేరుతో విడుదల కానుంది. తెలుగులో ధనుష్‌కు మంచి మార్కెట్ ఉంది. ఆయన గత సినిమా ‘రఘువరన్ బీటెక్’ తెలుగులో మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాలో ధనుష్ సగటు మధ్యతరగతి యువకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ‘మారి’లో లోకల్ డాన్‌గానూ మెప్పించాడు. కాగా ఈ ‘పటాస్’ సినిమాను ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించాడు. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలు. ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్‌గా చేసింది. ఈ భామ ఇంతకు ముందు ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’, ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’, ‘ఎంత మంచివాడవురా’ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. పటాస్‌ను లోకల్ బాయ్ పేరుతో తెలుగులో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత సీహెచ్‌ సతీష్‌కుమార్‌ విడుదల చేస్తున్నాడు. ఫిబ్రవరిలో విడుదలకానుంది.

First published: January 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు