తమిళ్‌లో ఇస్మార్ట్ శంకర్‌.. హీరో ఎవరంటే..

Ismart Shankar : డైరెక్టర్ పూరి జగన్నాథ్.. కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక సతమతం అవుతున్న సమయంలో హీరో రామ్‌తో కలిసి 'ఇస్మార్ట్ శంకర్' సినిమా చేయడం.. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని.. బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన విషయం తెలిసిందే.

news18-telugu
Updated: August 25, 2019, 9:34 AM IST
తమిళ్‌లో ఇస్మార్ట్ శంకర్‌.. హీరో ఎవరంటే..
Photo : Instagram.com/ram_pothineni
  • Share this:
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. కొన్నాళ్లుగా సరైన విజయం లేక సతమతం అవుతున్న సమయాన.. మరో వైపు రామ్ కూడా కెరీర్ పరంగా తన స్టామీనాకు తగ్గ హిట్‌ను అందుకోలేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి 'ఇస్మార్ట్ శంకర్' సినిమా చేయడం.. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని.. బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది.  ఈ సినిమాలో పూరి టేకింగ్‌కి.. రామ్ ఎనర్జీ తోడవడం పాటు పూరి రాసిన డైలాగ్స్ ‌తో  తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ మొత్తం అదిరిపోయాయి. వీటితో పాటు నిధి అగర్వాల్, నభా నటేష్‌లు తమ అందచందాలతో సినిమాకు మరింత ఆకర్షణను తెచ్చారు. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ సినిమాను విజయ్ దేవరకొండతో చేస్తున్నట్లు దర్శకుడు పూరి, నిర్మాత చార్మీ ట్వీటర్ వేధికగా ఇటీవల ప్రకటించారు.
అది అలా ఉంటే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు హిందీ, తమిళ్ ఇండస్ట్రీల నుండి రీమేక్స్ రైట్స్ కోసం మంచి ఆఫర్స్ వస్తున్నాయట. అందులో భాగంగా పూరి, తమిళ రీమేక్ రైట్స్‌ను ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థకు అమ్మేయడం జరిగిందని, అంతేకాదు  ఈ తమిళ 'ఇస్మార్ట్ శంకర్‌'లో ధనుష్ నటించనున్నారని తమిళ ఇండస్ట్రీ వర్గాల టాక్.  అయితే ఈ ప్రచారంలో నిజమెంతో  తెలియాలంటే మాత్రం, 'ఇస్మార్ట్ శంకర్' చిత్ర బృందం స్పందించాల్సిందే.
First published: August 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading