హోమ్ /వార్తలు /సినిమా /

Dhanush - The Gray Man : ధనుశ్ హాలీవుడ్ ప్రాజెక్ట్ ‘ది గ్రే మ్యాన్’ ట్రైలర్‌ విడుదల..

Dhanush - The Gray Man : ధనుశ్ హాలీవుడ్ ప్రాజెక్ట్ ‘ది గ్రే మ్యాన్’ ట్రైలర్‌ విడుదల..

ధనుశ్ హాలీవుడ్ మూవీ ‘ది గ్రే మ్యాన్’ ట్రైలర్ విడుదల (Twitter/Photo)

ధనుశ్ హాలీవుడ్ మూవీ ‘ది గ్రే మ్యాన్’ ట్రైలర్ విడుదల (Twitter/Photo)

Dhanush Hollywood The Gray Man Trailer Talk | ప్రస్తుతం మన దేశ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా అందరిని అలరిస్తున్నాయి. తాజాగా ధనుశ్ నటించిన హాలీవుడ్ మూవీ ‘ది గ్రే మ్యాన్’. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌‌ను విడుదల చేశారు.

Dhanush Hollywood | ప్రస్తుతం మన దేశ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా అందరిని అలరిస్తున్నాయి. ముఖ్యంగా చైనా, జపాన్, రష్యా, అమెరికాలో మన సినిమాలకు మంచి వసూళ్లనే దక్కుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిని అలరించింది. ఈ సినిమాతో ప్రభాస్.. ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ కూడా ఓవర్సీస్ మార్కెట్‌లో కుమ్మేసింది.  ఆ సంగతి పక్కన పెడితే.. మన దేశ నటులు అపుడపుడు హాలీవుడ్‌తో పాటు పలు ఇంటర్నేషనల్ సినిమాల్లో యాక్ట్ చేస్తూ సత్తా చూపెడుతూనే ఉన్నారు. ఇక ధనుశ్ కూడా ఇప్పటికే ‘ది ఎక్స్‌ట్రార్డనీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ అనే ఇంటర్నేషనల్  ప్రాజెక్ట్‌లో సందడి చేసారు. తాజాగా ఇతను మరో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్టు సమాచారం. ‘ది గ్రే మ్యాన్’ (The Gray Man) Lethal Force అనే నవల్‌ను సినిమా తెరకెక్కించారు. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను నిర్మించింది.

జో మరియు ఆంటోని రూసో బిగ్ బడ్జెట్ నెట్‌ఫ్లిక్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘ది గ్రే మెన్’లో ధనుశ్ ముఖ్యపాత్రలో నటించడంతో భారతీయ మార్కెట్‌లో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ధనుశ్ రాకతో ఈ ప్రాజెక్ట్‌కు భారత్‌లో కూడా మంచి మార్కెట్ ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ధనుశ్‌ను ఈ సినిమాలో ఏరి కోరి తీసుకున్నట్టు సమాచారం.ఈ చిత్రంలో ధనుశ్ సరసన జెస్సీకా హెన్‌విక్ యాక్ట్ చేస్తోంది. ఈ చిత్రంలో రియాన్ గోలింగ్, క్రస్ ఎవాన్స్, అనాదే అర్మాస్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. అంతేకాదు నెట్‌ఫ్లిక్స్‌ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ‘ది గ్రే మ్యాన్’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ తాజాగా విడుదలైంది.

పూర్తి ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిన ఈ హాలీవుడ్ చిత్రంలో ధనుశ్ ఓ సన్నివేశంలో కనిపిస్తారు. మొత్తంగా ధనుశ్ ఈ చిత్రంలో కొద్ది సేపు ఉండే అతిథి పాత్రలా ఉంది. ఈ సినిమా ‘డాక్టర్ అమెరికా’, అవెంజర్ సిరీస్ తెరకెక్కించిన రస్సో బ్రదర్స్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో ధనుశ్‌తో పాటు రియాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్, జెస్సికా హెన్విక్, అనా డి అర్మాస్ వంటి హాలీవుడ్ నటీనటులు నటించారు. ఈ యాక్షన్  చిత్రం నేరుగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా జూలై 22నన నెట్‌ఫ్లిక్స్‌లో మన దేశంలో విడుదల కానుంది.

Jr NTR : అపుడు త్రివిక్రమ్.. ఇపుడు కొరటాల శివ.. ఆయుధం ఎన్టీఆర్..

యూఎస్ మార్కెట్‌లో ఒక వారం ముందు  జూన్ 15న విడుదల కానుంది. అంతేకాదు ఈ చిత్రాన్ని 200 యూఎస్ మిలియన్ డాలర్స్‌తో తెరకెక్కించారు.నిడివి 122 నిమిషాలు ఉంది. మరోవైపు సమంత కూడా ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా.

First published:

Tags: Dhanush, Hollywood, Netflix, The Gray Man

ఉత్తమ కథలు