Dhanush Hollywood | ప్రస్తుతం మన దేశ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా అందరిని అలరిస్తున్నాయి. ముఖ్యంగా చైనా, జపాన్, రష్యా, అమెరికాలో మన సినిమాలకు మంచి వసూళ్లనే దక్కుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిని అలరించింది. ఈ సినిమాతో ప్రభాస్.. ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ కూడా ఓవర్సీస్ మార్కెట్లో కుమ్మేసింది. ఆ సంగతి పక్కన పెడితే.. మన దేశ నటులు అపుడపుడు హాలీవుడ్‌తో పాటు పలు ఇంటర్నేషనల్ సినిమాల్లో యాక్ట్ చేస్తూ సత్తా చూపెడుతూనే ఉన్నారు. ఇక ధనుశ్ కూడా ఇప్పటికే ‘ది ఎక్స్ట్రార్డనీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ అనే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌లో సందడి చేసారు. తాజాగా ఇతను మరో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్టు సమాచారం. ‘ది గ్రే మ్యాన్’ (The Gray Man) Lethal Force అనే నవల్ను సినిమా తెరకెక్కించారు. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను నిర్మించింది.
జో మరియు ఆంటోని రూసో బిగ్ బడ్జెట్ నెట్ఫ్లిక్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘ది గ్రే మెన్’లో ధనుశ్ ముఖ్యపాత్రలో నటించడంతో భారతీయ మార్కెట్లో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ధనుశ్ రాకతో ఈ ప్రాజెక్ట్‌కు భారత్‌లో కూడా మంచి మార్కెట్ ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ధనుశ్‌ను ఈ సినిమాలో ఏరి కోరి తీసుకున్నట్టు సమాచారం.ఈ చిత్రంలో ధనుశ్ సరసన జెస్సీకా హెన్విక్ యాక్ట్ చేస్తోంది. ఈ చిత్రంలో రియాన్ గోలింగ్, క్రస్ ఎవాన్స్, అనాదే అర్మాస్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. అంతేకాదు నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ‘ది గ్రే మ్యాన్’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మే 24న మరికొన్ని గంటల్లో విడుదల చేయనున్నారు.
LETHAL FORCE 🔥#Dhanush's Poster From @netflix's #TheGrayMan
Trailer out Tomorrow !@dhanushkraja @Russo_Brothers #Dhanush pic.twitter.com/XwnXcNmbds
— BA Raju's Team (@baraju_SuperHit) May 23, 2022
ఇక ఈ సినిమాను జూన్ 22న మన దేశంలో విడుదల కానుంది. యూఎస్ మార్కెట్లో ఒక వారం ముందు జూన్ 15న విడుదల కానుంది. అంతేకాదు ఈ చిత్రాన్ని 200 యూఎస్ మిలియన్ డాలర్స్‌తో తెరకెక్కించారు.నిడివి 122 నిమిషాలు ఉంది. మరోవైపు సమంత కూడా ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా.
మరోవైపు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్టు సమాచారం. హృతిక్ రోషన్ కున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ గెర్ష ఏజెన్సీ అతనితో వరుసగా మూడు నాలుగు ఫ్రాంచైజీలకు సంబంధించిన ఓ సినిమా చేయడానికి ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. హృతిక్ రోషన్ విషయానికొస్తే.. ఆయన బాడీ స్ట్రక్చర్ గ్రీకు శిల్పాన్ని పోలీ ఉంటుంది. మరోవైపు ధూమ్, క్రిష్ ఇంగ్లీష్ వెర్షన్స్ హాలీవుడ్ ప్రేక్షకులను అలరించాయి. దీంతో హాలీవుడ్ నిర్మాణ సంస్థ హృతిక్ రోషన్‌తో సినిమాలు చేయడానికి ముందుకొచ్చినట్టు సమాచారం. మొత్తంగా ఇపుడు హాలీవుడ్లో కూడా మన ఇండియన్ స్టార్స్ సందడి చేయడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dhanush, Hollywood, The Gray Man