ధనుష్ ఆ మధ్య రఘువరన్ బిటెక్ సినిమాతో తెలుగులో కూడా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. కానీ దాన్ని కంటిన్యూ చేయడంలో మాత్రం విఫలమయ్యాడు ధనుష్. కానీ ఆ తర్వాత ప్రతీ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదు మన ప్రేక్షకులు. ఇక ఇప్పుడు దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ తొలిసారి కాంబినేషన్‌లో ఈయన ఎనై నోకి పాయుమ్ తోట సినిమా చేస్తున్నాడు. దీన్నిప్పుడు తెలుగులో తూటా పేరుతో అనువదిస్తున్నారు. మేఘ ఆకాష్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఇందులో అతిథి పాత్రలో నటిస్తున్నాడు.
ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌కు దర్భుక శివ సంగీతం అందిస్తుండగా.. మనోజ్ పరమహంస, ఎస్ఆర్ కాథిర్, జామన్ టి జాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విజయభేరి బ్యానర్ పై జి తాత రెడ్డి, జి సత్యనారాయణ రెడ్డి ఈ చిత్రం తెలుగు హక్కులను కొనుగోలు చేశారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఏడాదిగా ఈ చిత్రం విడుదలకు నోచుకోవడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.