news18-telugu
Updated: September 9, 2019, 8:58 AM IST
Instagram/dhanushkraja
Asuran trailer ; ధనుష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ‘అసురన్’. వెట్రి మారన్ దర్శకత్వం వహించారు. వెట్రి మారన్ గతంలో ధనుష్‌తో 'పొల్లాదవన్', 'ఆడుకళమ్' అనే సినిమాలు తీశారు. 'ఆడుకళమ్' సినిమాకు ధనుష్‌కు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత వీరి కాంబీనేషన్‌లో వచ్చిన మరో సినిమా 'వడచెన్నై'. ఈ సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా మరోసారి ఈ ఇద్దరి కాంబీనేషన్‌లో వస్తున్న సినిమా 'అసురన్'. ఈ సినిమా ట్రైలర్‌ను ఆదివారం సాయంత్రం విడుదల చేసింది చిత్ర బృందం. అసురన్ ట్రైలర్లో ధనుష్ తన నటనతో దుమ్మురేపారు. ట్రైలర్లో ధనుష్.. మాస్ లుక్‌లో అదరగొట్టాడు. సినిమా గ్రామీణ నేపథ్యంలో.. రెండు వర్గాల మధ్య సాగుతూ.. వ్యక్తిగత కక్ష్యలు, భూమికోసం పోరాటం చేస్తున్నట్లు ధనుష్ కనిపించాడు. అయితే ఇక్కడ విశేశమేమంటే ధనుష్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించనున్నారు.
అసురన్.. అక్టోబరు 4న విడుదల కాబోతోంది. కాగా ఇంతకు ముందు ధనుష్ ‘మారి 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అసురన్..లో ధనుష్‌తో పాటు ముఖ్య పాత్రల్లో మంజు వారియర్, ప్రకాశ్‌రాజ్, అభిరమి నటిస్తున్నారు. ఈ సినిమాను కలైపులి ఎస్ థాను నిర్మిస్తుండగా.. జి.వి ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
Published by:
Suresh Rachamalla
First published:
September 9, 2019, 8:55 AM IST