DHANUSH AISHWARYAA SPLIT RAJINIKANTHS DAUGHTER CALLED HERSELF PROUD WIFE IN LAST POST FOR HUSBAND TA
Dhanush - Aishwaryaa Divorce : ధనుశ్, ఐశ్యర్య విడిపోవడానికి అసలు కారణం ఇదేనా..
ధనుశ్, ఐశ్యర్య విడిపోవడానికి గల కారణాలు ఇవే.. (Instagram/Photo)
Dhanush - Aishwaryaa Divorce | సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జరిగిపోతున్నాయి. తాజాగా ధనుశ్, ఐశ్యర్య విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇక వీళ్లిద్దరు విడిపోవడానికి గల కారణాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Dhanush - Aishwaryaa Divorce : సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జరిగిపోతున్నాయి. కొందరు మాత్రం అలాగే దశాబ్ధాల పాటు కలిసుంటున్నారు కానీ మరికొందరు మాత్రం కొన్నేళ్లకే విడిపోతున్నారు. గతేడాది నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్న సంగతి మరవకముందే.. తాజాగా స్టార్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న రజినీకాంత్ (Rajinikanth) అల్లుడు, కూతుళ్లైన ధనుశ్, ఐశ్యర్య విడిపోతున్నట్టు ప్రకటించడంతో ఒక్కసారిగా రజినీకాంత్ అభిమానులతో పాటు ధనుశ్ అభిమానులు హతాశులయ్యారు. గతంలో రజినీకాంత్ రెండో కూతురు సౌందర్య కూడా తన మొదటి భర్త అశ్విన్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత విశాగన్ వనంగమూడిని రెండో పెళ్లి చేసుకుంది. తాజాగా రజినీకాంత్ పెద్ద కూతురు విడాకులు తీసుకోవడం కోలీవుడ్‌తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
ధనుష్ తన భార్య ఐశ్యర్య నుంచి విడిపోతున్నట్లు సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో అటు ఆయన ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు షాక్‌కు గురైయ్యారు. ధనుష్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యని 2004లో పెళ్లి చేసుకున్నారు. గత 18 ఏళ్లకు కలిసి ఉంటున్న ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ 18 ఏళ్ల ప్రయాణంలో ఈ జంటకు యాత్ర, లింగ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
చూడ చక్కని జంటగా పేరు తెచ్చుకున్న ధనుశ్, ఐశ్యర్య విడిపోవడానికి అసలు కారణాలు తెలియరాలేదు. కానీ వీళ్లిద్దరు విడిపోవడానికి ఓ హీరోయిన్‌తో ధనుశ్ రిలేషన్ షిప్ అనే ముచ్చట కోలీవుడ్‌తో పాటు పలు మీడియా సంస్థలు కోడై కూస్తున్నాయి. ఆ హీరోయిన్ కారణంగా వీళ్లిద్దరి రిలేషన్‌కు బీటలు వారేలా చేసిందనే వాదన ఉంది. ఇందులో ఎంత నిజం ఉందో మాత్రం ఎవరికీ తెలియదు.
కానీ చివరగా ఐశ్యర్య.. తన భర్త .. ధనుశ్.. ‘అసురన్’ సినిమాలోని నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. అదే సమయంలో ఐశ్యర్య నాయన సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఒకేసారి కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకున్నారు. ఈ సందర్భంగా ఒక కూతురుగా.. ఒక భార్యగా నేను చాలా గర్వంగా ఫీలవుతున్నాను అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
ధనుశ్.. వరుసగా తమిళంతో పాటు హిందీ, తెలుగులో చిత్రాలు చేస్తున్నారు. గతేడాది చివర్లో ధనుశ్.. ‘అతరంగీ’లో నటించారు. మొత్తంగా ధనుశ్, ఐశ్వర్య మాత్రం తాము ఎందుకు విడిపోతున్నామనే విషయాన్ని ప్రస్తావించలేదు. ధనుశ్ విడుదల చేసిన నోట్లో ‘ మేం 18 సంవత్సరాల పాటు కలిసి ఉన్నాము. స్నేహితులుగా భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా కలిసి బ్రతికాం.. అనుకోని కారణాల వల్ల ఈరోజు మేము విడి పోతున్నాం. ఇది ఇద్దరం అనుకుని తీసుకున్న అనూహ్య నిర్ణయం. మా ఈ నిర్ణయాన్ని, మా గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాము.. అని తెలిపారు ధనుష్. దీనికి సంబంధించి ఆయన సోషల్ మీడియాలో విడుదల చేసిన ఆ నోట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.