సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, నటుడు ధనుష్ (Dhanush) దంపతులు ఇటీవలే విడిపోతున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానులు షాక్ అయ్యారు. తాము వీడిపోతున్నామనే వార్త చెప్పడానికి సోషల్ మీడియా (Social Media)లో వెల్లడించారు. అయితే ఈ ఇద్దరూ ఇంకా చట్టబద్ధంగా విడిపోలేదని తెలుస్తోంది. ఇక ధనుష్, ఐశ్వర్య మాత్రం విడాకుల వ్యవహారం కేవలం కుటుంబ కలహాల వంటిది మాత్రమే అని ధనుష్ తండ్రి కస్తూరి రాజా వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలతో మళ్లీ వారిద్దరూ కలిసిపోతారా అనే చర్చ కూడా మొదలైంది. అయితే ధనుష్ నుంచి దూరం జరిగాగ ఐశ్వర్య (Aishwarya) ఏం చేస్తుందని తెలుసుకోవడానికి తమిళ మీడియ ఫోకస్ చేసింది. సోషల్ మీడియాలో తమ విడిపోయినట్లు ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత, నటుడు ధనుష్ మరియు అతని విడిపోయిన భార్య ఐశ్వర్య రజనీకాంత్ హైదరాబాద్‌లోని ఒకే హోటల్లో దిగినట్లు సమాచారం.
Pushpa Song: అక్కడ కూడా మనోళ్ల డామినేషనే.. బీటీఎస్‌లో సమంత మానియా!
ఈ మాజీ జంట రామోజీ రావు స్టూడియోలోని సితార హోటల్లో ఉన్నారు. వారు వారి సంబంధిత పనిలో వారు ఉన్నట్టు సమాచారం. ఒకరి విషయాల్లో ఒకరు పట్టించుకోవడం లేదని తమిళ మీడియా పేర్కొంటున్నారు. రజనీకాంత్ (Rajinikanth) కుమార్తె ఆమె దర్శకత్వం వహించబోయే పాట కోసం అక్కడ ఉంది, అయితే రంఝానా నటుడు ఏదో ఒక చిత్రంలో పని చేస్తున్నట్లు సమాచారం.
View this post on Instagram
శనివారం, పాట తయారీలో బిజీగా ఉన్న ఐశ్వర్య ఫోటో ఆన్లైన్లో కనిపించింది. చిత్రంలో, ఐశ్వర్య టేబుల్‌కి ఒక చివర కూర్చుని తన బృందంతో పని గురించి చర్చిస్తూ కనిపించింది.
OTT Platforms: యూట్యూబ్ నుంచి నెట్‌ఫ్లిక్స్ వరకు ఆన్లైన్ ప్లాట్ ఫాం ధరల వివరాలు
ఐశ్వర్య, ధనుష్ జనవరి 17 న ఉమ్మడి ప్రకటన ద్వారా సోషల్ మీడియాలో తమ విడిపోతున్నట్లు ప్రకటించారు. నాగచైతన్య, సమంత విడిపోతున్నట్టు ప్రకటించిన కొద్ది గంటల్లోనే సమంత సోషల్ మీడియాతో తనలో అక్కినేనిని తీసేసింది. రూత్ ప్రభును పెట్టుకుంది. కానీ ఐశ్వర్య మాత్రం ఇంకా ధనుష్ పేరును తొలగించలేదు. ధనుష్, ఐశ్వర్య 2004 లో వివాహం చేసుకున్నారు. వారికి యాత్ర రాజా, లింగరాజు అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aishwarya, Dhanush, Divorce couple, Kollywood, Tamilnadu