Home /News /movies /

DHANUSH ACCEPT ANOTHER INTERNATIONAL PROJECT ALONGSIDE RYAN GOSLING TA

Dhanush: ధనుశ్ చేతిలో మరో క్రేజీ ఆఫర్.. హాలీవుడ్‌లో మరోసారి అలరించనున్న అసురన్..

ధనుశ్ (Twitter/Photo)

ధనుశ్ (Twitter/Photo)

Dhanush Hollywood | ప్రస్తుతం మన దేశ సినిమాలు అందరిని అలరిస్తున్నాయి. ముఖ్యంగా చైనా, జపాన్, రష్యా, అమెరికాలో మన సినిమాలకు మంచి వసూళ్లనే దక్కుతున్నాయి. తాజాగా ధనుశ్ మరో హాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాడు.

    Dhanush Hollywood | ప్రస్తుతం మన దేశ సినిమాలు అందరిని అలరిస్తున్నాయి. ముఖ్యంగా చైనా, జపాన్, రష్యా, అమెరికాలో మన సినిమాలకు మంచి వసూళ్లనే దక్కుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిని అలరించింది. ఈ సినిమాతో ప్రభాస్.. ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ సంగతి పక్కన పెడితే.. మన దేశ నటులు అపుడపుడు హాలీవుడ్‌తో పాటు పలు ఇంటర్నేషనల్ సినిమాల్లో యాక్ట్ చేస్తూ సత్తా చూపెడుతూనే ఉన్నారు. ఇక ధనుశ్ కూడా ఇప్పటికే ‘ది ఎక్స్‌ట్రార్డరనీర జర్నీ ఆఫ్ ది ఫకీర్’ అనే హాలీవుడ్ ప్రాజెక్ట్‌లో సందడి చేసారు. తాజాగా ఇతను మరో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ వెబ్ సిరీస్ మొదటి భాగం వచ్చే యేడాది ప్రథమార్ధంలో విడుదల కానుంది.

    జో మరియు ఆంటోని రూసో బిగ్ బడ్జెట్ నెట్‌ఫ్లిక్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘ది గ్రే మెన్’లో ధనుశ్ ముఖ్యపాత్రలో నటించడానికి ఓకే చెప్పాడట. ఈ చిత్రంలో ధనుశ్ సరసన జెస్సీకా హెన్‌విక్ యాక్ట్ చేస్తోంది. ఈ చిత్రంలో రియాన్ గోలింగ్, క్రస్ ఎవాన్స్, అనాదే అర్మాస్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. అంతేకాదు నెట్‌ఫ్లిక్స్‌ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్టు సమాచారం. ధనుశ్ రాకతో ఈ ప్రాజెక్ట్‌కు భారత్‌లో కూడా మంచి మార్కెట్ ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ధనుశ్‌ను ఈ సినిమాలో ఏరి కోరి తీసుకున్నట్టు సమాచారం.

    Dhanush Accept Another International Project Alongside Ryan Gosling,Dhanush: ధనుశ్ చేతిలో మరో క్రేజీ ఆఫర్.. హాలీవుడ్‌లో మరోసారి అలరించనున్న అసురన్..,Dhanush,Dhanush Hollywood Project,Dhanush Another International Project,Dhanush Twitter,Dhanush Instagram,Kollywood,hollywood,ధనుశ్,ధనుశ్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్,ధనుశ్ హాలీవుడ్ ప్రాజెక్ట్,ధనుశ్ ఇంగ్లీష్ సినిమా
    ధనుశ్ మరో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ (Twitter/Photo)


    మరోవైపు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్టు సమాచారం. హృతిక్ రోషన్ కున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ గెర్ష ఏజెన్సీ అతనితో వరుసగా మూడు నాలుగు ఫ్రాంచైజీలకు సంబంధించిన ఓ సినిమా చేయడానికి ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. హృతిక్ రోషన్ విషయానికొస్తే.. ఆయన బాడీ స్ట్రక్చర్ గ్రీకు శిల్పాన్ని పోలీ ఉంటుంది. మరోవైపు ధూమ్, క్రిష్ ఇంగ్లీష్ వెర్షన్స్ హాలీవుడ్ ప్రేక్షకులను అలరించాయి. దీంతో హాలీవుడ్ నిర్మాణ సంస్థ హృతిక్ రోషన్‌తో సినిమాలు చేయడానికి ముందుకొచ్చినట్టు సమాచారం. మొత్తంగా ఇపుడు హాలీవుడ్‌లో కూడా మన ఇండియన్ స్టార్స్ సందడి చేయడం విశేషం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Dhanush, Hollywood, Kollywood

    తదుపరి వార్తలు