తన స్వర జ్ఞానంతో ఎన్నో తరాల ప్రేక్షకులని ఊర్రూతలూగించిన 'మాస్ట్రో' ఇళయరాజా 80వ సంవత్సరంలోకి అడుగుపెడుతూ, హైదరాబాద్ లో మునుపెన్నడూ చేయనంత పెద్ద కాన్సర్ట్ (Ilayaraja Concert) చేయనున్నారు. క్లాస్, మాస్, మెలోడీ, భక్తి.. ఇలా అన్ని రకాల పాటలని మైమరచిపోయి వినేలా అందించిన ఈ దిగ్గజ సంగీత దర్శకుడి హైదరాబాద్ కాన్సర్ట్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
ఫిబ్రవరి 26న గచ్చిబౌలి స్టేడియం లో 'హైదరాబాద్ టాకీస్' వారు నిర్వహించనున్న ఈ భారీ ఈవెంట్ ఎంట్రీ టికెట్లు శరవేగంగా అమ్ముడవుతున్నాయి. ఇటీవల దీనికి సంబంధించిన ట్రైలర్ ని రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri prasad) డిజిటల్ లాంచ్ చేయడంతో ఈవెంట్ పై అంచనాలు పెరిగాయి. తాజాగా 'ఇళయరాజా' కాన్సర్ట్ ట్రైలర్ విడుదల చేశారు.
ఇందులో స్వయంగా ఆయనే పాటలని పాడడం, వాటిలోని ప్రతీ భావోద్వేగాన్ని తన చుట్టూ ఉన్న యువత ఆస్వాదించడం చూపిస్తూ ఈవెంట్ లో స్పందన ఎలా ఉండబోతుందో పరోక్షంగా కళ్ళ ముందు ఉంచారు. ఆయన సంగీత ఝరిలో ఇన్నేళ్లుగా మునిగి తేలుతున్న ఎంతో మంది అభిమానులకి 26న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం ఒక కళాక్షేత్రం గా మారనుందని ట్రైలర్ షూట్ చేసిన దర్శకుడు విజయ్ చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cinema, Devi Sri Prasad, Tollywood