Home /News /movies /

DEVI SRI PRASAD OUT FROM SALMAN KHAN MOVIE KABHI EDI KABHI DIWALI SB

Devi Sri Prasad: దేవిశ్రీ ప్రసాద్‌ ట్యూన్స్ నచ్చలేదు.. అతడి మ్యూజిక్ వద్దన్న స్టార్ హీరో ..!

దేవీ శ్రీ ప్రసాద్

దేవీ శ్రీ ప్రసాద్

దేవిశ్రీ అందించిన ట్యూన్స్ పట్ల  బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

    దేవీ శ్రీ ప్రసాద్ బీట్ వచ్చిందటే.. జనాలకు పూనకాలే. దేవి శ్రీ మ్యూజిక్ మ్యూజిక్ వచ్చిందంటే ఫ్యాన్స్‌కు పండగే. ఇక  ఇప్పటివరకు దేవీ శ్రీ పలువురు స్టార్ హీరోలుకు హిట్ మ్యూజిక్ అందించాడు. ఒకప్పుడు దేవిశ్రీ (Devisri Prasad) టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ హాట్ ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు. కొరటాల శివ, త్రివిక్రమ్ తో పాటు పలువురు దర్శకులు దేవిశ్రీ ట్యూన్స్ కోరుకునేవారు.

    అయితే తాజగా దేవీ శ్రీ మ్యూజిక్ ఓ స్టార్ హీరోకు నచ్చలేదు. దీంతో ఆయనను పక్కన పెట్టేశాడని తెలుస్తోంది. దేవిశ్రీ అందించిన ట్యూన్స్ పట్ల  బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) అసంతృప్తి వ్యక్తం చేశారట. కబీ ఈద్ కబీ దివాళి ప్రాజెక్ట్ నుండి దేవీశ్రీని తప్పించి కెజిఎఫ్ ఫేమ్ రవి బసృర్ ని ఎంచుకున్నారని తెలుస్తోంది. ఆయన అందించిన టైటిల్ ట్రాక్ కూడా సల్మాన్ కి బాగా నచ్చిందట. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్, టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. నిజానికి గతంలో దేవిశ్రీ అల్లు అర్జున్ కోసం కంపోజ్ చేసిన రింగా రింగా, సిటీ మార్ సిటీ మార్ సాంగ్స్ ట్యూన్స్ సల్మాన్ తన చిత్రాల్లో వాడుకున్నారు.

    ఫర్హాద్ సామ్జీ తెరకెక్కిస్తున్న కబీ ఈద్ కబీ దివాళి చిత్రంలో పూజా హెగ్డే, కృతి సనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీలో వెంకటేష్ కీలక రోల్ చేస్తున్నారని తెలుస్తుంది. అలాగే ఓ సాంగ్ లో రామ్ చరణ్, పూజ, సల్మాన్, వెంకీ స్టెప్స్ వేయనున్నారట. ఇక సల్మాన్ చిరంజీవి (Chiranjeevi)గాడ్ ఫాదర్ మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఆయన ఈ మధ్య సౌత్ స్టార్ట్స్ తో ఎక్కువగా టచ్ లో ఉంటున్నారు.

    మరోవైపు  దేవీ శ్రీ ప్రసాద్ విషయానికి వస్తే... అజ్ఞాతవాసి చిత్రం నుండి త్రివిక్రమ్ దేవిశ్రీకి ఆఫర్ ఇవ్వడం లేదు. ఇక కొరటాల శివ కెరీర్ బిగినింగ్ నుండి దేవిశ్రీనే మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నారు. ఆచార్య విషయానికి వచ్చేసరికి మార్చేశారు. నెక్స్ట్ ఎన్టీఆర్ తో చేస్తున్న చిత్రానికి అనిరుధ్ ని ఎంచుకున్నారు. దేవిశ్రీ చేతిలో ఉన్న ఒకే ఒక స్టార్ డైరెక్టర్ సుకుమార్ మాత్రమే. సుకుమార్ కి మాత్రం దేవిశ్రీ ఆస్థాన సంగీత దర్శకుడు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Devi Sri Prasad, Salman khan, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు