మరోసారి మెగా హీరోతో త్రివిక్రమ్ హీరోయిన్ రొమాన్స్..

Nivetha Pethuraj : 'మెంటల్ మదిలో' అనే సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైన భామ నివేథా పేతురాజ్.

news18-telugu
Updated: March 11, 2020, 1:01 PM IST
మరోసారి మెగా హీరోతో త్రివిక్రమ్ హీరోయిన్ రొమాన్స్..
త్రివిక్రమ్ Photo : Twitter
  • Share this:
Nivetha Pethuraj : 'మెంటల్ మది'లో అనే సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైన భామ నివేథా పేతురాజ్. ఆ సినిమాలో శ్రీ విష్ణు సరసన భాగానే రోమాన్స్ చేసింది. సినిమా భాగానే అలరించిన ఈ అమ్మడుకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ సినిమాల్లో బిజీ అయ్యింది. తమిళ డబ్బింగ్ సినిమా టిక్..టిక్..టిక్..లో నివేతా నటించిన, ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. అయితే ఆ మధ్య వచ్చిన సాయి ధరమ్ తేజ్ 'చిత్ర లహరి'లో మరో తెలుగు సినిమా 'బ్రోచేవారేవరురా..' లో కూడా అదరగొట్టింది నివేథా. అయితే ఆ సినిమాలు ఏవీ పెద్దగా బ్రేక్ ఇవ్వలేదు. కానీ తాజాగా త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో అల్లు అర్జున్ మరదలిగా అందాలు ఒలకబోస్తూ అదరగొట్టింది. ఈ సినిమా సంక్రాతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదల అయ్యి.. బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. దీంతో ఎప్పటినుంచో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోన్న నివేథాకు ఈ సినిమా చాలా హెల్ఫ్ అయ్యింది.

Deva Katta Sai Tej film update,Nivetha pethuraj news,sai dharam tej,sai dharam tej songs,sai dharam tej new movie,nivetha pethuraj,deva katta vennela movie comedy,sai tej movies,sai tej started new movie with star director,meghamsh srihari about sai dharam tej,sai dharma teja new movie,maruthi vs sai tej,varun tej,sai dharam tej latest,sai dharam tej speech,sai dharam tej family,sai dharam tej movies
త్రివిక్రమ్‌తో నివేథా Photo : Twitter

కాగా తాజా సమాచారం మేరకు నివేథా మరో సారి మెగా హీరోతో రొమాన్స్ చేయనుంది. చిత్రలహరిలో సాయి తేజ్‌ సరసన మెరిసిన సంగతి తెలిసిందే. దేవా కట్టా దర్శకత్వంలో సాయి తేజ్ ఓ సినిమా చేస్తున్నాడు. భగవాన్, పుల్లారావు నిర్మిస్తున్న ఈ సినిమాలో నివేథా.. సాయి తేజ్ సరసన నటించనుంది. కాగా ఈసినిమాకు సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

Deva Katta Sai Tej film update,Nivetha pethuraj news,sai dharam tej,sai dharam tej songs,sai dharam tej new movie,nivetha pethuraj,deva katta vennela movie comedy,sai tej movies,sai tej started new movie with star director,meghamsh srihari about sai dharam tej,sai dharma teja new movie,maruthi vs sai tej,varun tej,sai dharam tej latest,sai dharam tej speech,sai dharam tej family,sai dharam tej movies
సాయి తేజ్, దేవా కట్టా Photo : Twitter
Published by: Suresh Rachamalla
First published: March 11, 2020, 1:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading