హోమ్ /వార్తలు /సినిమా /

దేశ్ కి నేత: కేసీఆర్ పాలనపై సాంగ్.. రిలీజ్ చేసిన అన్‌స్టాపబుల్‌ యూనిట్

దేశ్ కి నేత: కేసీఆర్ పాలనపై సాంగ్.. రిలీజ్ చేసిన అన్‌స్టాపబుల్‌ యూనిట్

Desh ki netha song photo twitter

Desh ki netha song photo twitter

రవీంద్ర భారతి లో అన్ స్టాపబుల్ చిత్ర యూనిట్ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై రూపొందిన దేశ్ కి నేత సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ సీడీని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

చలనచిత్ర కళాకారులందరికి తెలంగాణ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని సాంస్కృతిక శాఖా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ (V Srinivas Goud) అన్నారు. రవీంద్ర భారతి లో అన్ స్టాపబుల్ చిత్ర యూనిట్ ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) పాలనపై రూపొందిన దేశ్ కి నేత సాంగ్ (Desh Ki netha song) ను విడుదల చేశారు. ఈ సాంగ్ సీడీని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అన్ స్టాపబుల్ చిత్రం హీరో సన్నీ, హీరోయిన్ నక్షత్ర, డైరెక్టర్ డైమండ్ రత్నబాబు, నిర్మాత రజిత్ రావ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... కళాకారులకి కులం మతం ప్రాంతం సంబంధం లేదని ఎవరికైనా తెలంగాణ ప్రభుత్వం సహాయ సహకారం అందిస్తుందని తెలిపారు. ఒక టాలీవుడ్ కే కాకుండా బాలీవుడ్ కోలీవుడ్ అన్నిటికీ హైదరాబాద్ కేంద్రంగా రూపుదిద్దుకోనుందని మంత్రి ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకొని ఎంతో అభివృద్ధి చేశారని, అదే అభివృద్ధి దేశ వ్యాప్తంగా కూడా జరగాలని ఉద్దేశంతోనే కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారని వివరించారు. కెసిఆర్ తోనే ఉంటానని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని భాషల చిత్రాలు నిర్మాణం జరగాలని ఇక్కడ కళాకారులకి మంచి అవకాశాలు రావాలని ఆయన ఆకాంక్షించారు.

డైరెక్టర్ డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ... మా అన్‌స్టాపబుల్‌ చిత్తాన్ని నిర్మాత రజిత్ రావు గారు ఖర్చుకు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న మా సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దేశ్ కి నేత సాంగ్ గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద వారి పాలన మీద చిత్రీకరించడం జరిగింది. సాంగ్ కు మంచి స్పందన లభిస్తోంది అన్నారు.

నిర్మాత రజిత్ రావ్ మాట్లాడుతూ... మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్న మంచి పనుల మీద ఒక సాంగ్ చెయ్యాలని అనుకోని దేశ్ కి నేత సాంగ్ చేశాము. ఈ సాంగ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది. మా అన్‌స్టాపబుల్‌ సినిమా మీ అందరికి నచ్చుతుంది. త్వరలో ఈ సినిమా మీ ముందుకు రాబోతొంది. బిగ్ బాస్ సన్నీ, నక్షత్ర, సప్తగిరి, అక్ష ఖాన్ పోటీ పడి నటించారు అన్నారు.

Published by:Sunil Boddula
First published:

Tags: Cinema, CM KCR, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు