Prabhas - Salaar: ప్రభాస్ 'సలార్' ప్రారంభోత్సవానికి చీఫ్‌ గెస్ట్‌గా డిప్యూటీ సీఎం..

రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించబోయే 'సలార్‌' సినిమాకు ముహూర్తం కుదిరింది. ఈ ఎగ్జయిటింగ్‌ ప్రాజెక్ట్‌కి వస్తున్న ముఖ్య అతిథి ఎవరో తెలుసా..

Prabhas - Salaar: రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించబోయే 'సలార్‌' సినిమాకు ముహూర్తం కుదిరింది. ఈ ఎగ్జయిటింగ్‌ ప్రాజెక్ట్‌కి వస్తున్న ముఖ్య అతిథి ఎవరో తెలుసా..

  • Share this:
    రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ ఇప్పుడు అన్నీ ప్యాన్‌ ఇండియా మూవీస్‌కే ఓకే చెబుతూ వస్తున్నాడు. తన మార్కెట్‌ రేంజ్‌ అలా పెరిగింది. ఇప్పటికే ప్రభాస్‌ హీరోగా చేస్తున్న రాధేశ్యామ్‌ సెట్స్‌పై ఉంది. ఈ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా తర్వాత మరో మూడు ప్యాన్‌ ఇండియా సినిమాలు చేతిలో ఉన్న సంగతి కూడా అధికారికంగా అందరికీ తెలిసిందే. అయితే ముందుగా ఏ సినిమా సెట్స్‌పైకి వెళుతుందనే దానిపై చాలా వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అయితే అధికారికంగా ప్రభాస్‌ నెక్ట్స్‌ ఏ మూవీ షూటింగ్‌లో పాల్గొంటాడనే దానిపై క్లారిటీ వచ్చేసింది. కేజీయఫ్‌ ఛాప్టర్‌ 1తో ప్యాన్‌ ఇండియా డైరెక్టర్‌గా క్రేజ్‌ దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్‌.. ఇప్పుడు కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2ను భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2 పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి అవుతుండగానే ప్రశాంత్‌ నీల్‌, ప్రభాస్‌తో చేయబోతున్న 'సలార్‌' సినిమాను సెట్స్‌పైకి తీసుకెళుతున్నాడు. సంక్రాంతి సందర్భంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు 'సలార్‌' సినిమాకు లాంఛనంగా కొబ్బరి కాయను కొడుతున్నారట.

    భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ‘స‌లార్‌’ అనౌన్స్‌మెంట్ రోజు నుండి ప్రేక్ష‌కాభిమానుల్లో ఎగ్జ‌యిట్‌మెంట్‌ను పెంచేస్తుంది. భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్న ‘స‌లార్‌’ చిత్రం లాంఛింగ్‌ కార్య‌క్ర‌మానికి స‌లార్ చిత్ర‌యూనిట్ స‌హా క‌ర్ణాట‌క డిప్యూటీ చీఫ్ మినిష్ట‌ర్ అశ్వ‌త్ నారాయ‌ణ్ సీఎన్‌, ద‌ర్శ‌కధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ స‌హా ఇత‌ర సినీ ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నారు. 'సలార్‌' అంటే కింగ్‌ మేకర్‌ అనే అర్థం అంటూ ప్రశాంత్‌ నీల్‌ చెప్పిన సంగతి తెలిసిందే. అంటే ఈ సినిమాలో ప్రభాస్‌ కింగ్‌ మేకర్‌ అయితే కింగ్‌గా మరో కీలక నటుడు నటిస్తున్నాడనేది క్లియర్‌. ఆ పాత్రలో మోహన్‌లాల్‌ కనిపించబోతున్నారంటూ కూడా వార్తులు వినిపిస్తున్నాయి. దిశాపటాని ఇందులో హీరోయిన్‌గా నటిస్తుందని టాక్‌.

    'సలార్‌' కోసం ప్రభాస్‌ నాలుగు నెలల సమయం కేటాయిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది పూర్తి కాగానే ఆదిపురుష్‌ సినిమాను సెట్స్‌ పైకి తీసుకెళతాడట ప్రభాస్‌. ప్రస్తుతం ప్రభాస్‌ చేస్తున్న 'రాధేశ్యామ్‌' సినిమా పీరియాడికల్‌ లవ్‌స్టోరి. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌. రాధాకృష్ణకుమార్‌ దర్శకుడు. ఈ సినిమా విడుదలను మార్చిలో చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
    Published by:Anil
    First published: