ఆ వయసులో రేప్‌కు గురయ్యా.. అదీ తల్లి వల్లే : సంచలన విషయం బయటపెట్టిన నటి

Demi Moore : స్కూల్ డ్రాపౌట్ అయిన తాను.. తల్లిని వదిలేసి ఇంట్లో నుంచి వచ్చేశానని చెప్పారు. అయితే ఆ సమయంలో చేతిలో చిల్లిగవ్వ లేదని.. అలాంటి తరుణంలో నటన వైపు అడుగులు వేశానని అన్నారు.

news18-telugu
Updated: September 25, 2019, 8:27 AM IST
ఆ వయసులో రేప్‌కు గురయ్యా.. అదీ తల్లి వల్లే : సంచలన విషయం బయటపెట్టిన నటి
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 25, 2019, 8:27 AM IST
హాలీవుడ్ నటి డెమీ మూర్ తన జీవితంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని తన పుస్తకం 'ఇన్‌సైడ్ అవుట్'లో బయటపెట్టారు. పుస్తకం గురించి వివరించేందుకు 'గుడ్ మార్నింగ్ అమెరికా' అనే టీవీ షోలో పాల్గొన్న ఆమె..తనకు ఎదురైన చేదు అనుభవం గురించి స్వయంగా వివరించారు. తన తల్లి కారణంగా 15ఏళ్ల వయసులోనే అత్యాచారానికి గురయ్యానని చెప్పారు.మద్యానికి బానిసైన తన తల్లి 500 డాలర్ల కోసం తనను ఆ కామాంధుడి చేతిలో బలిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఒకరోజు తాను ఇంటికెళ్లే సమయానికి.. అక్కడో వృద్దుడు తమ అపార్ట్‌మెంట్ 'కీ'తో నిలుచున్నాడని.. తాను వెళ్లగానే లోపలికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని వాపోయారు.

అయితే కేవలం మద్యం కోసం మీ తల్లి మిమ్మల్ని ఇలా బలిచేసి ఉంటుందా అన్న ప్రశ్నకు డెమీ మూర్ మరోలా స్పందించారు. తన మనసులో ఎక్కడో తల్లి అలా చేయదు అన్న భావన ఉన్నప్పటికీ.. అతనికి అలాంటి అవకాశం కల్పించింది ఆమెనే కదా అన్న ఫీలింగ్ కూడా ఉందని తెలిపారు. ఏదేమైనా ఆ ఘటన తనను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందని చెప్పారు. స్కూల్ డ్రాపౌట్ అయిన తాను.. తల్లిని వదిలేసి ఇంట్లో నుంచి వచ్చేశానని చెప్పారు. అయితే ఆ సమయంలో చేతిలో చిల్లిగవ్వ లేదని.. అలాంటి తరుణంలో నటన వైపు అడుగులు వేశానని అన్నారు. పోగొట్టుకోవడానికి ఎలాగు ఏమీ లేదు కాబట్టి ధైర్యంగా ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పారు.మొదట్లో చాలావరకు ఆడిషన్స్ ఇచ్చానని.. 'జనరల్ హాస్పిటల్' అనే టీవీ సిరీస్ తన జీవితాన్ని మలుపు తిప్పిందని చెప్పుకొచ్చారు. అప్పటినుంచి సినీ కెరీర్‌లో ఊహించినంత బిజీ అయిపోయానని చెప్పుకొచ్చారు. తన కొత్త పుస్తకం 'ఇన్‌సైడ్ అవుట్'లో ఈ వివరాలన్నీ ఉంటాయని అన్నారు.


First published: September 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...