అరవింద్ కేజ్రీవాల్‌ను స్పందింప చేసిన జబర్థస్త్ యాంకర్ రష్మీ గౌతమ్..

ఈ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ విధులు నిర్వహించే వారు సరిగా పనిచేయడం లేదంటూ జబర్థస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ మండి పడిన సంగతి తెలిసిందే కదా. రష్మీ గౌతమ్ చేసిన ట్వీట్‌కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రీ ట్వీట్ చేసారు.

news18-telugu
Updated: April 11, 2019, 12:35 PM IST
అరవింద్ కేజ్రీవాల్‌ను స్పందింప చేసిన జబర్థస్త్ యాంకర్ రష్మీ గౌతమ్..
అరవింద్ కేజ్రీవాల్,రష్మీ గౌతమ్
news18-telugu
Updated: April 11, 2019, 12:35 PM IST
దేశ వ్యాప్తంగా మొదటి విడతలో 91 లోక్‌సభ స్థానాలకు ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. ఐతే ఈ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ విధులు నిర్వహించే వారు సరిగా పనిచేయడం లేదంటూ జబర్థస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ మండి పడిన సంగతి తెలిసిందే కదా. ఈ ఎన్నికల్లో తనతో పాటు తన తల్లికి ఇప్పటి వరకు ఓటర్ స్లిప్పులు అందలేదని  యాంకర్ రష్మీ నిన్న సాయంత్రం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే కదా. తమ కుటుంబానికి విశాఖపట్నంలో  ఓటర్ ఐడీ ఉందని అక్కడే ఎప్పటి నుంచో నివాసం ఉంటున్నామని కూడా చెప్పింది. తమతో పాటు తాము ఉంటున్న నివాస సముదాయంలో ఎవరికీ ఓటర్ స్లిప్పులు అందలేదన్న విషయమై ఎన్నికల కమిషన్ ‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. ఓటు హక్కుతోనే మనకు ప్రశ్నించే అవకాశం వస్తోందని రష్మి తెలిపింది. ఇక రష్మీకి వాళ్ల అమ్మకి సంబంధించిన ఓటర్ స్లిప్పులు మిస్ అవ్వడంపై  టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక కథనం ప్రసారం అయింది. ఈ విషయమై రష్మీ గౌతమ్ ఓటర్  స్లిప్ మిస్ కావడం పై టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనంపై అరవింద్ కేజ్రీవాల్  రీ ట్వీట్ చేసారు. ఇపుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.First published: April 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...