Rajamouli: రాజమౌళి ట్వీట్‌కు స్పందించిన ఢిల్లీ ఎయిర్ పోర్ట్ యాజమాన్యం.. ఏమన్నారంటే..?

రాజమౌళి (Rajamouli)

Rajamouli: రాజమౌళికి (Rajamouli) ఇప్పుడు ఉన్న క్రేజ్ గురించి మాటల్లో చెప్పడం కష్టమే. ఎందుకంటే ఈయన సినిమా చేస్తే పాన్ ఇండియా మొత్తం దద్ధరిల్లిపోతుంది. అలాంటి రాజమౌళి నోటి నుంచి ఏదైనా మాట వచ్చిందంటే ఇండియన్ వైడ్‌గా పాపులర్ అవుతుంది.

  • Share this:
రాజమౌళికి ఇప్పుడు ఉన్న క్రేజ్ గురించి మాటల్లో చెప్పడం కష్టమే. ఎందుకంటే ఈయన సినిమా చేస్తే పాన్ ఇండియా మొత్తం దద్ధరిల్లిపోతుంది. ముఖ్యంగా బాహుబలి తర్వాత రాజమౌళి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆకాశమంత స్థాయికి ఈయన క్రేజ్ పెరిగింది. అలాంటి రాజమౌళి నోటి నుంచి ఏదైనా మాట వచ్చిందంటే ఇండియన్ వైడ్‌గా పాపులర్ అవుతుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. జులై 1 అర్ధరాత్రి ఈయన ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చాడు. అయితే అక్కడ కరోనా నిర్ధారణ కోసం RT-PCR టెస్ట్ చేయించుకోవాలి. దానికోసం కొన్ని పత్రాలు నింపాల్సి ఉంది. అవి తీసుకున్న తర్వాత ఫిల్ చేయడానికి కనీస వసతులు కూడా లేకపోవడం చూసి రాజమౌళి షాక్ అయ్యాడు. దేశ రాజధాని ఎయిర్‌ పోర్టులో కనీస వసతులు కూడా లేవంటూ ట్వీట్ చేసాడు. అంతేకాదు.. అక్కడ చాలా మంది గోడలకు ఆనుకుని.. నేలపై కూర్చుని వాటిని నింపుతున్నారని.. బయటికి వచ్చి చూస్తే గేట్ దగ్గర ఊరకుక్కలు సమూహాలు దర్శనం ఇచ్చాయని ట్వీట్ చేసాడు. ఢిల్లీ ఎయిర్ పోర్టు ఇలా ఉండటం మన దేశానికే మంచిది కాదని.. బయటి వాళ్ల ముందు అగౌరవంగా ఉంటుందంటూ ఈయన చెప్పుకొచ్చాడు.

దానికి వెంటనే ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి కూడా రిప్లై వచ్చింది. డియర్ రాజమౌళి మీరు ఇచ్చిన సలహాలు, సూచనలు తప్పకుండా తీసుకుంటున్నాం.. మరింత మెరుగు పరచడానికి ప్రయత్నిస్తున్నాం.. అక్కడ ప్రయాణికులకు, సిబ్బందికి మీరు చెప్పినట్లే మరింత మెరుగైన సదుపాయాలు కల్పిస్తాం అంటూ ట్వీట్ చేసారు. ఏదేమైనా కూడా రాజమౌళి ట్వీట్‌తో అక్కడ మరిన్ని మంచి సదుపాయాలు వస్తున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published: