కంటెంట్ ప్రధానంగా తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం డెజావు (Dejavu) సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం తెలుగులో అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వీడియోలో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతుంది. అరుల్‌నిథి (Arul Nithi), మధు బాల (Madhu Bala), స్మృతి వెంకట్ (Smruthi venkat), అచ్యుత్ కుమార్ (Achyuth kumar), కాళీ వెంకట్ (Kali Venkat), మిమే గోపి (Gopi) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మిస్టరీ థ్రిల్లర్‌కి అరవింద్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు. గ్రిప్పింగ్ ట్విస్ట్‌లు, ఊహించని మలుపులతో శ్రీనివాసన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఒక నవల రచయిత ఊహించిన పాత్రలు సజీవంగా వచ్చి అతన్ని బెదిరించినప్పుడు ఏమి జరుగుతుంది? కల్పన అనేది భయానక వాస్తవంగా మారినప్పుడు ఏమి జరుగుతుంది?.. అనేదే డెజావు చిత్రం. ఈ కథలో పోలీసు ఇన్వెష్టిగేషన్ ప్రారంభం కావడం, హత్యలు, ఇతర ఘోరమైన ఘటనలు చోటుచేసుకోవడం.. చిత్రంపై ఉత్కంఠను తారాస్థాయికి చేరుస్తుంది. చివరి వరకు కూడా దర్శకుడు ఈ చిత్రాన్ని సస్పెన్స్‌తో నడిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
2022 జూలైలో తమిళంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడు సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ విధమైన నాణ్యమైన కంటెంట్, థ్రిల్లింగ్ అనుభూతిని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో భవాని DVD ఇంక్ పై రాజశేఖర్ అన్నభీమోజు తెలుగు వెర్షన్‌ను నిర్మించారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం, పీజీ ముత్తయ్య సినిమాటోగ్రఫీ ప్రశంసలు అందుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cinema, Tollywood, Tollywood actor