దమ్ముంటే నా సినిమా ఆపు...జీవితా రాజశేఖర్‌కు దర్శకుడు స్ట్రాంగ్ వార్నింగ్...

సినిమా టీజర్ లోని బోల్డ్ సన్నివేశాలు మహిళలను కించపరిచేలాగా ఉన్నాయని ఇప్పటికే సినీ రంగానికే చెందిన జీవితా రాజశేఖర్ విమర్శించారు. అయితే దీనిపై దర్శకుడు నరసింహా నంది స్పందిస్తూ, తన సినిమా సెన్సార్ పూర్తి చేసుకుందని, దమ్ముంటే రిలీజ్ కాకుండా అడ్డుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చాడు.

news18-telugu
Updated: November 24, 2019, 6:44 PM IST
దమ్ముంటే నా సినిమా ఆపు...జీవితా రాజశేఖర్‌కు దర్శకుడు స్ట్రాంగ్ వార్నింగ్...
జీవిత రాజశేఖర్‌
  • Share this:
నిన్న ఏడు చేపల కథ, నేడు డిగ్రీ కాలేజ్ సినిమా టైటిల్ ఏదైనా కంటెంట్ మాత్రం ఒక్కటే. బోల్డ్ సీన్లతో టీజర్లు వదిలి తమ సినిమా అలాంటిదే అని చెప్పకనే చెప్పేసి, స్టార్లు లేకపోయినా ఓపెనింగ్స్ ఇలా తెచ్చుకోవచ్చు. అనే కమర్షియల్ సూత్రం ఈ రోజు తెలుగు సినిమాలో ట్రెండ్‌గా మారింది. ఇదిలా ఉంటే తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న డిగ్రీ కాలేజ్ సినిమా కూడా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. సినిమా టీజర్ లోని బోల్డ్ సన్నివేశాలు మహిళలను కించపరిచేలాగా ఉన్నాయని ఇప్పటికే సినీ రంగానికే చెందిన జీవితా రాజశేఖర్ విమర్శించారు. అయితే దీనిపై దర్శకుడు నరసింహా నంది స్పందిస్తూ, తన సినిమా సెన్సార్ పూర్తి చేసుకుందని, దమ్ముంటే రిలీజ్ కాకుండా అడ్డుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు తన సినిమాను అడ్డుకోవడం ఎవరి వల్లా కాదని, సినిమా చూడకుండా కామెంట్స్ చేయవద్దని దర్శకుడు నరసింహ నంది హెచ్చరించాడు.
First published: November 24, 2019, 6:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading