హోమ్ /వార్తలు /సినిమా /

Kangana: కంగనాకు ఆ కేసులో హైకోర్టులో ఊరట..!

Kangana: కంగనాకు ఆ కేసులో హైకోర్టులో ఊరట..!

కంగనా

కంగనా

వృద్ధురాలి ఫొటోను షేర్‌ చేస్తూ కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రూ.100 కూలీ ఇచ్చి రైతుల ఉద్యమంలోకి తీసుకువచ్చినట్లు ట్వీట్‌ చేసింది.

  బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌కు ఓ తలనొప్పి తప్పింది. పరువు నష్టం కేసులో కంగనా రనౌత్‌కు పంజాబ్‌ – హర్యానా హైకోర్టు ఊరటనిచ్చింది. ఈ నెల 14న బటిండా కోర్టుకు హాజరుకాకుండా ఆమెకు మినహాయింపును ఇచ్చింది. సెప్టెంబర్‌ 8 వరకు కంగనాకు ఊరట కల్పిస్తూ కేసు విచారణను చేపట్టవద్దని దిగువ కోర్టును ఆదేశించింది. గతేడాది కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆందోళనలపై అప్పట్లో కంగనా చేసిన వ్యాఖ్యలు కొన్ని కలకలం రేపాయి.

  జనవరిలో బటిండాకు చెందిన మొహిందర్‌ కౌర్‌ అనే వృద్ధురాలి ఫొటోను షేర్‌ చేస్తూ కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రూ.100 కూలీ ఇచ్చి రైతుల ఉద్యమంలోకి తీసుకువచ్చినట్లు ట్వీట్‌ చేసింది. దీంతో మొహింద్‌ కౌర్ బటిండా కోర్టులో కంగనాపై పరువు నష్టం దావా వేసింది. గతేడాది జనవరి 4, 2021న పరువు నష్టం కేసును నమోదు చేశారు. ఈ మేరకు కోర్టు ఈ నెల 14న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఇటీవల కంగనా పంజాబ్‌ – హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను కొట్టి వేయాలంటూ కోర్టును కోరింది.

  మరోవైపు కంగనా పై ప్రముఖ బాలీవుడ్ లిరికిస్ట్ జావేద్ అక్తర్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కంగనా రనౌత్ వల్ల తన ప్రతిష్ట దెబ్బతిందని జావేద్ అక్తర్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ తనపై పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేశారని ఆయన ఆరోపించారు. నవంబర్ 2020లో అక్తర్ ఆమెపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కేసులో కూడా కంగనా కోర్టుకు హాజరవుతూ వస్తోంది. ఇటీవలే ఈ కేసులో కూడా కంగనా గత సోమవారం సబర్బన్ అంధేరిలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. బాలీవుడ్ గీత రచయిత జావేద్ అక్తర్ తనపై దాఖలు చేసిన పరువు నష్టం ఫిర్యాదుకు సంబంధించి ఆమె హాజరయ్యారు. ముందుగా ఆమె జడ్జితో పర్సనల్‌గా మాట్టాడుతూ తనకు ప్రైవసీ కావాలని కోరారు.

  అందుకు జడ్జి అంగీకరించారు. మీడియాను, విలేకరులను పంపించేసి ఆమెకు ప్రైవసీని కల్పించారు. ఇక దీనిపై సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. ఇంత ప్రైవసీ అవసరమా! అని కొందరంటే, న్యాయస్థానం రూల్స్ ప్రకారమే కంగనా అడిగిందనీ, ఆమె లాయర్ సమయానుకూలంగా ఆలోచన కలిగించారని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈనెల 20న ఫైనల్ తీర్పురానుందని తెలుస్తోంది.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Bollywood, Kangana Ranaut

  ఉత్తమ కథలు