దీపికా, రణ్‌వీర్ పెళ్లి ఫోటోలపై స్మృతి ఇరానీ కామెంట్

దీపికా, రణ్‌వీర్‌ల పెళ్లి పోటోలు వాళ్ల వివాహానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడం కోసం  సామాన్య జనాలే కాదు..సెలబ్రీటీలు, రాజకీయ నాయకులు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా దీపికా, రణ్‌వీర్‌ల పెళ్లి ఫోటోల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోను చూస్తూ అర్థమవుతోంది.

news18-telugu
Updated: November 15, 2018, 1:27 PM IST
దీపికా, రణ్‌వీర్ పెళ్లి ఫోటోలపై స్మృతి ఇరానీ కామెంట్
స్మృతి ఇరానీ, దీప్‌వీర్
  • Share this:
దీపికా, రణ్‌వీర్‌ల పెళ్లి పోటోలు వాళ్ల వివాహానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడం కోసం  సామాన్య జనాలే కాదు..సెలబ్రీటీలు, రాజకీయ నాయకులు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా దీపికా, రణ్‌వీర్‌ల పెళ్లి ఫోటోల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోను చూస్తూ అర్థమవుతోంది.

తాజాగా దీప్‌వీర్‌ల వివాహం ఇటలీలోని లేక్‌కోమో ప్రాంతంలో బుధవారం కొంకణీ సంప్రదాయ పద్దతిలో జరిగింది. ఐతే వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ ఎక్కడ లీక్ కాకుండా దీప్‌వీర్‌లు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న దీప్‌వీర్ పెళ్లికి సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా దీపికా, రణ్‌వీర్‌ల పెళ్లి ఫోటోలను చూడాలనే కోరికను ఉద్దేశిస్తూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఒక అస్థిపంజరం బల్ల కూర్చొని ఎదురుచూస్తున్నట్లుగా ఉన్న ఫన్నీ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.View this post on Instagram

#when you have waited for #deepveer #wedding #pics for too longgggg 🤦‍♀️

A post shared by Smriti Irani (@smritiiraniofficial) on

ఇపుడీ ఫోటో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. దీన్ని బట్టి అభిమానులు, సినీ ప్రముఖులే కాదు స్మృతి ఇరానీ కూడా దీపికా, రణ్‌వీర్‌ల పెళ్లి ఫోటోలను చూడాలనే ఆసక్తితో ఉన్నట్టు అర్థమవుతోంది. ఈ రోజు దీప్‌వీర్‌ల వివాహం సింధీ సంప్రదాయ పద్ధతిలో జరుగుతోంది. ఆ తర్వాత  ఈ నెల 21 బెంగళూరులో, 28న ముంబాయిలో వీరిద్దరి వివాహా రిసెప్షన్ జరగనుంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 15, 2018, 1:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading