Deepthi Sunaina : బిగ్ బాస్ తెలుగు సెకండ్ సీజన్లో తన అల్లరితో అందరినీ ఆకట్టుకున్న భామ దీప్తి సునైనా... తన అందంతోనూ, మంచి డ్యాన్స్ తోనూ అదరగొడుతూ.. నిత్యం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది. హైదరాబాద్‌కి చెందిన ఈ 20 ఏళ్ల సోషల్ మీడియా స్టార్ హైదరాబాద్‌లోని స్టెవెన్స్ అన్నాస్ కాలేజ్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. దీప్తి సునైనా ఒకవైపు చదువుకుంటూనే..మరోవైపు మోడలింగ్ చేస్తుంటుంది. మరోవైపు సినిమాలపై ఉన్న ఇష్టంతో చాలా షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. అయితే ఇంత వరకు ఈ భామకు సరైన సినిమా బ్రేక్ రాలేదు. దీప్తి సునైనా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుంది. అందులో భాగంగా తాజాగా మరో సారి తన అందమైన ఫిగర్‌తో ఓ వీడియో చేసింది. ఆ వీడియోలో ఓ పాపులర్ పాటకు తన అందమైన శరీరాన్ని హింసిస్తూ హాట్‌గా యోగా విన్యాసాలు చేస్తోంది. పూర్తిగా తన శరీరాన్ని విల్లులా వంచిన దీప్తి నెటిజన్స్ తెగ ఆకట్టుకుంటోంది. దీంతో ఆ వీడియోను అందులో ఈ భామ చేసిన ఆ విన్యాసాలను తెగ పొగుడుతున్నారు నెటిజన్స్... సునైనా.. సూపర్ అంటూ తెగ కామెంట్స్ పెడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.