• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • DEEPTHI SUNAINA BOYFRIEND SHANMUKH GET EMOTIONAL ABOUT SUNAINA BEHAVIOR MK

దీప్తి సునైన కోసం మాజీ ప్రియుడు షణ్ముఖ్...లైవ్‌లో ఏం చేశాడో తెలిస్తే షాక్...అందరూ చూస్తుండగానే..

దీప్తి సునైన కోసం మాజీ ప్రియుడు షణ్ముఖ్...లైవ్‌లో ఏం చేశాడో తెలిస్తే షాక్...అందరూ చూస్తుండగానే..

దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ (Image: Facebook)

shanmukh and deepthi sunaina relationship: షణ్ముఖ్ ఓ పక్కన యూట్యూబ్ లో కవర్ డ్యాన్సులు చేస్తూనే తన పార్ట్ నర్ డాన్సర్ గా పరిచయమైన దీప్తి సునైనా తో సైలంట్ గా రొమాన్స్ చేశాడనే పేరుంది. అటు సోషల్ మీడియా లో కూడా వీరిద్దరూ జంటకు మంచి క్రేజ్ ఉంది.

  • Share this:
    shanmukh and deepthi sunaina relationship: ఒకప్పుడు సినిమా స్టార్స్, టీవీ స్టార్స్ కు జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. ఇప్పుడు డిజిటల్ మీడియాలో పేరొందిన వెబ్ సిరీస్ స్టార్స్ కు కూడా విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. టీవీ, సినిమాలను దాటిన కళ ఇప్పుడు వెబ్ సిరీస్ లకు చేరింది. మొబైల్ ఫోన్ ఉంటే చాలు ఎంచక్కా రకరకాల ఓటీటీ ఫ్లాట్ ఫాంలలో కొత్త ఐడియాలతో వస్తున్న వెబ్ సిరీస్ లను చూసి ఎంజాయ్ చేయవచ్చు. అయితే ఈ వెబ్ సిరీస్, యూట్యూబ్ షార్ట్ ఫిలింల ద్వారా ప్రస్తుతం కెరీర్ స్టార్ట్ చేసి సినిమాల్లో సైతం రాణిస్తున్న వారున్నారు. ఉదాహరణకు రాజ్ తరుణ్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ సైతం షార్ట్ ఫిలిమ్స్ నటించి స్టార్ స్థాయికి ఎదిగారు. ఇక యూట్యూబ్ ద్వారా మిలియన్ల కొద్ది అభిమానులను అందుకున్న స్టార్లలో షణ్ముఖ్ కూడా ఒకడు. వైవా హర్ష షార్ట్ ఫిలిం ద్వారా పరిచయం అయిన షణ్ముఖ్. తన డ్యాన్సులతోనూ, షార్ట్ ఫిలిమ్స్ తోనూ ఎంత సంచలనం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అరేయ్ ఏంట్రా ఇది అంటూ షణ్ముఖ్ చేసే సిగ్నేచర్ డైలాగ్ ఇప్పుడు తెగ ఫేమస్ అయిపోయింది. ఇక దీప్తీ సునైనతో కలిసి షణ్ముఖ్ జస్వంత్ చేసే డాన్సులు కుర్రకారును ఉర్రూతలు ఊగించాయి. ఇప్పుడు షణ్ముఖ్ అటు సినిమాల్లో బిజీ ఆర్టిస్టు కానున్నాడు.

    అయితే షణ్ముఖ్ ఓ పక్కన యూట్యూబ్ లో కవర్ డ్యాన్సులు చేస్తూనే తన పార్ట్ నర్ డాన్సర్ గా పరిచయమైన దీప్తి సునైనా తో సైలంట్ గా రొమాన్స్ చేశాడనే పేరుంది. అటు సోషల్ మీడియా లో కూడా వీరిద్దరూ జంటకు మంచి క్రేజ్ ఉంది. అయితే షణ్ముఖ్, దీప్తి సునైనా ఇద్దరు ఒక్కపుడు లవర్స్ అని టాక్ ఉంది. అయితే బిగ్ బాస్ లో దీప్తి సునైనా ఎంట్రీ ఇవ్వడం , హౌస్ లో తనీష్ తో లవ్ ట్రాక్ నడపడంతో వీరిద్దరూ బ్రేక్ అప్ అయ్యారని వీరి సన్నిహితులు చెబుతుంటారు. అటు సోషల్ మీడియా లో వీళ్లిద్దరు ఎప్పుడు లైవ్ ఇంటరాక్షన్ పెట్టినా, అభిమానులు వీళ్ళ ప్రేమ గురించే ఇప్పటికీ అడుగుతున్నారు.

    ఇటీవల కూడా షణ్ముఖ్ తన అభిమానులతో చేసిన ఒక్క లైవ్ ఇంటరాక్షన్ లో కూడా ఆయన అభిమానులు దీని గురించే అడుగుతుండేసరికి షణ్ముఖ్ వాళ్లకు సమాధానము ఇస్తూ  నా చేతి మీద ఈ టాటూ అలాగే ఉంది, అది పోయాక చూద్దాం, అప్పటి వరుకు నాకు దీప్తీ సునైనపై ప్రేమ ఉంటుంది అనే అనుకుంటున్న’ అంటూ సమాధానం ఇచ్చాడు.

    మరోవైపు షణ్ముఖ్ దీప్తి సునైన తర్వాత తన జంటగా వైష్ణవితో లవ్ ట్రాక్ నడిపాడని సోషల్ మీడియా మొత్తం కోడై కూసింది. అయితే దీనికి కూడా షణ్ముఖ్ సమాధానం ఇస్తూ ‘వైష్ణవికి ఇప్పుడు పెళ్లి కూడా అయిపోయింది. లేని పోనీ రిలేషన్స్ పెట్టి ఇబ్బంది పెట్టొద్దని ఫాన్స్ ను కోరాడు. అయితే అటు దీప్తీ సునైన కూడా షణ్ముఖ్ విషయంలో కాస్త మెత్తబడ్డట్టే కనిపిస్తోందని, త్వరలోనే ఈ జంట ఓ వెబ్ సిరీస్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదనే వాదన వినిపిస్తోంది.
    Published by:Krishna Adithya
    First published: