దీపికా పడుకొనే చపాక్‌కు వినోదపు పన్ను మినహాయింపు..

Twitter

యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా ‘చపాక్‌’.

  • Share this:
    యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా ‘చపాక్‌’. ‘పద్మావత్‌’ తర్వాత దీపికా ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. ‘రాజీ’ దర్శకులు మేఘనా గుల్జార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించింది. చపాక్ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ‘చపాక్‌’కు పన్ను మినహాయిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోషల్‌మీడియా వేదికగా ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ట్వీట్‌లో ‘యాసిడ్‌ దాడి బాధితురాలు జీవితాన్ని ఆధారంగా చేసుకుని దీపిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘చపాక్‌’. ప్రపంచవ్యాప్తంగా జనవరి 10న విడుదల కానుంది. మధ్యప్రదేశ్‌లో ‘చపాక్‌’కు పన్ను మినహాయిస్తున్నట్లు ప్రకటిస్తున్నాను.’ అని తెలిపారు. తాజాగా ఈ చిత్రానికి మరో రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం కూడా చపాక్‌కు వినోదపుపన్ను మినహాయిస్తున్నట్టు ప్రకటించింది. కాగా ఈరోజు విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతోంది.  అది అలా ఉంటే  జేఎన్‌యూలో హింసాత్మక ఘటనలపై దేశవ్యాప్తంగా దుమారం కొనసాగుతున్న సందర్బంలో.. ఆ ఘటనలో గాయపడిన వారికి మద్దతుగా దీపికా బుధవారం సాయంత్రం జేఎన్‌యూ క్యాంపస్‌కు వచ్చి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె నటించిన‘చపాక్’ మూవీని బాయ్‌కాట్ చేయాలంటూ ఓ వర్గం వారు ట్విట్టర్‌లో  ‘బాయ్‌కాట్ చపాక్’ అంటూ హ్యాష్‌ట్యాగ్‌‌ను క్రియేట్ చేయడంతో పాటు ట్రెండింగ్ కూడా చేశారు.
    దీపికా పదుకొనే హాట్ పిక్స్..
    Published by:Suresh Rachamalla
    First published: