మేకప్ లేకుండా జిమ్‌లో దీపిక వర్కౌట్స్..ఫోటోలు వైరల్

దేశంలో ఇన్‌స్టాగ్రమ్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన వ్యక్తిగా దీపిక పదుకొనె దూసుకుపోతోంది. విరాట్ కోహ్లీ, ప్రియాంక చోప్రా 50 మిల్లియన్ ఫాలోవర్ల మైలురాయిని చేరుకోగా...దీపిక పదుకొనె వారికి దగ్గర్లో ఉంది.

news18-telugu
Updated: February 21, 2020, 6:29 PM IST
మేకప్ లేకుండా జిమ్‌లో దీపిక వర్కౌట్స్..ఫోటోలు వైరల్
దీపిక పదుకొనె
  • Share this:
బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ పొందుతున్న హీరోయిన్స్‌లో దీపిక పదుకొనె కూడా ఒకరు. పెళ్లి తర్వాత కూడా దీపికకు ఆఫర్లు ఏ మాత్రం తగ్గలేదు. ఓ రకంగా చెప్పాలంటే ఆఫర్లు మరింత పెరిగాయి. పెళ్లి తర్వాత కూడా తన కెరీర్‌ గ్రాఫ్ కిందికి పడిపోకుండా అద్భుతంగా మలుచుకోవడంలో దీపిక తన శరీరం సౌష్టవంపై చూపుతున్న శ్రద్ధ అంతా ఇంతాకాదు. జిమ్‌లో నిత్యం గంటల తరబడి వర్కౌట్స్ చేస్తుంది ఈ సొట్టబుగ్గల బ్యూటీ. ఏ దేశంలో పర్యటిస్తున్నా...ఎంతా బిజీగా ఉన్నా జిమ్‌లో ప్రతి రోజూ గంటారెండు గంటలైనా కసరత్తులు చేయడం మిస్ అవ్వదు.  జిమ్‌లో మేకప్ లేకుండా వర్కౌట్స్ చేస్తున్న సమయంలో తీసిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసింది దీపిక. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి

I did a push up today...Well,actually I fell down!But I had to use my arms to get back up so...you know,close enough!🤣🤣🤣


Deepika Padukone (@deepikapadukone) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి

👊🏽


Deepika Padukone (@deepikapadukone) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి


Deepika Padukone (@deepikapadukone) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది


ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్టింగ్స్‌ ద్వారా భారీ ఆదాయాన్ని కూడా పొందుతోంది దీపిక. దేశంలో అత్యధిక ఇన్‌స్టా ఫాలోవర్స్ కలిగిన మూడో వ్యక్తిగా దూసుకుపోతోంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఇప్పటి వరకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మాత్రమే 50 మిల్లియన్ ఫాలోవర్ల మైలురాయిని అధిగమించగా...44.2మిల్లియన్ల ఫాలోవర్లతో మూడో స్థానంలో నిలుస్తోంది దీపిక.
Published by: Janardhan V
First published: February 21, 2020, 6:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading