హోమ్ /వార్తలు /సినిమా /

Deepika Padukone: దీపికా వేసుకున్న నెక్లెస్... ఎన్ని కోట్లో తెలుసా ?

Deepika Padukone: దీపికా వేసుకున్న నెక్లెస్... ఎన్ని కోట్లో తెలుసా ?

దీపికా పదుకొణె

దీపికా పదుకొణె

దీపికా వేసుకున్న డైమండ్ నెక్లెస్ నిండా 18K తెల్ల బంగారం పచ్చ కళ్లు.. ఒనిక్స్ డాట్స్ 19.05 క్యారెట్ల బ్రిలియంట్ కట్ డైమండ్ లు ఉన్నాయి.

కేన్స్  ఫిల్మ్ ఫెస్టివల్ 2022 (Cannes Film Fesitval 2022) కొనసాగుతోంది. ఎంతో అట్టహాసంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలో అనేకమంది సెలబ్రిటీలు పాల్గొంటున్నారు. రెడ్ కార్పెట్ పై తారలు అందంగా మెరుస్తున్నారు. కరోనా క్రైసిస్ తరువాత ఈ సంవత్సరం ఎంతో ఉత్సాహంగా ఈ కేన్స్ వేడుకలు జరుగుతున్నాయి. ఇక ఈ వేడుకల్లో భారత్‌కు చెందిన అనేకమంది సినీ ప్రముఖులు తళుక్కుమన్నారు. భారతీయ నటీమణుల హవా ఈసారి బాగానే కనిపించింది. కేన్స్ ఉత్సవాలలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే(Deepika Padukone) కూడా పాల్గొంది.

బరిలో ఎంతమంది ఉన్నదీపికా వచ్చింది అంటే సైడ్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఈ కేన్స్ ఉత్సవాల్లో భాగంగా దీపికా పదుకొనే రకరకాల డిజైనర్ దుస్తులతో కేన్స్ వేదికపై ఒక మెరుపులు నడిపించింది.  అయితే ఈ ఫెస్టివల్‌లో తారలు వేసుకున్న డ్రెస్సులు, చెప్పులు, జువెలరీ ఇలా ప్రతీ ఒక్క వస్తువు కూడా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. మరీ ముఖ్యంగా వారు వేసుకున్న నగలు,దుస్తల ధరలు తెలుసుకునేందుకు కొందరు ఔత్సాహికులు ఆసక్తిగా ఉంటున్నారు. తాజాగా దీపికా వేసుకున్న ఓ నెక్లెస్ విలువ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దాని ఖరీదు తెలిసి అంతా షాక్ అవుతున్నారు.

కేన్స్ ఉత్సవాల్లో దీపిక పదుకొణె అత్యంత ప్రజాదరణ పొందిన పాంథెరే డి కార్టియర్ ఆభరణాన్ని ధరించింది.దీపికా ధరించిన ఆ ఆభరణం ధర దాదాపుగా 3.8 కోట్లు. నెక్లెస్ లో 18K తెల్ల బంగారం పచ్చ కళ్లు.. ఒనిక్స్ డాట్స్ 19.05 క్యారెట్ల బ్రిలియంట్ కట్ డైమండ్ లు ఉన్నాయి. అద్భుతమైన నెక్లెస్ కార్టియర్ పాంథెర్ సేకరణ నుండి ఎంపిక చేసుకున్నది ఇది. ఇప్పుడు దీపిక మెడలోని ఖరీదైన ఆ వైట్ నెక్లెస్ సోషల్ మీడియాలో అలాగే ఆ కేన్స్ హాట్ టాపిక్ గా మారింది. దీపిక ధరించిన ఆభరణాలు చూసిన అభిమానులు నోరెళ్లబెడుతారు.

మరోవైపు ఒక దశాబ్దం తరువాత జ్యూరీ మెంబర్ గా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఆహ్వానితురాలైన మొదటి భారతీయురాలిగా దీపిక పదుకొనే ఎంపికయింది.  ఈ కేన్స్ 2022 ఉత్సవాలలో దీపికా పదుకొనే తో పాటుగా ఎనిమిది మంది సభ్యుల జ్యూరీలో ఫ్రెంచ్ నటుడు అయిన విన్సెంట్ లిండన్ అధ్యక్షుడిగా ఉన్నారు.

First published:

Tags: Bollywood, Cannes Film Festival, Deepika Padukone

ఉత్తమ కథలు