దీపిక ప‌దుకొనే మైనపు విగ్రహం.. భార్యకు రణ్‌వీర్ సింగ్ బహిరంగ ముద్దులు..

మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు బొమ్మగా కలువైన దీపిక పదుకొనే

దీపిక ప‌దుకొనేకు ఉన్న క్రేజ్ గురించి మాట‌ల్లో ఏం చెప్తాం.. బాలీవుడ్ బ్యూటీ అయినా కూడా తెలుగు, త‌మిళనాట కూడా ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంది. ఇక ఓవ‌ర్సీస్ ఆడియ‌న్స్ కూడా దీపిక అంటే ప‌డి చ‌చ్చిపోతుంటారు.

  • Share this:
దీపిక ప‌దుకొనేకు ఉన్న క్రేజ్ గురించి మాట‌ల్లో ఏం చెప్తాం.. బాలీవుడ్ బ్యూటీ అయినా కూడా తెలుగు, త‌మిళనాట కూడా ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంది. ఇక ఓవ‌ర్సీస్ ఆడియ‌న్స్ కూడా దీపిక అంటే ప‌డి చ‌చ్చిపోతుంటారు. తాజాగా ఈమె మైన‌పు బొమ్మ లండ‌న్ మేడ‌మ్ తుస్సాడ్స్‌లో ఆవిష్క‌రించారు. అక్క‌డ ఇటు ర‌ణ్‌వీర్ సింగ్, అటు దీపిక కుటుంబాలు ఇద్ద‌రూ వ‌చ్చారు. ఈ వేడుక‌లో బాలీవుడ్ ప్ర‌ముఖులు కూడా పాలు పంచుకున్నారు. దీపిక ప‌దుకొనే త‌న వ్యాక్స్ స్టాచ్యూ చూసుకుంటూ మురిసిపోయింది.2016 ఐఫా అవార్డు వేడుక‌ల్లో వ‌చ్చిన రూపాన్ని తీసుకుని ఇప్పుడు ఈ మైన‌పు బొమ్మ‌ను సిద్ధం చేసారు. గ‌తేడాదే దీనిపై కన్ఫ‌ర్మేష‌న్ ఇచ్చింది దీపిక ప‌దుకొనే. ఇప్పుడు మేడ‌మ్ తుస్సాడ్స్ వెళ్లి అక్క‌డ త‌న మైన‌పు విగ్ర‌హాన్ని తానే ఆవిష్క‌రించుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇది చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోయారు. ఇప్ప‌టికే అక్క‌డ స‌ల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఐశ్వ‌ర్యా రాయ్, అమితాబ్ బ‌చ్చ‌న్, మాధురి దీక్షిత్ లాంటి సెలెబ్రెటీస్ మైన‌పు విగ్ర‌హాలున్నాయి.ఇప్పుడు దీపిక ప‌దుకొనే కూడా వ‌చ్చి చేరిపోయింది. ఇక ఈమె విగ్ర‌హాన్ని చూసి భ‌ర్త ర‌ణ్‌వీర్ సింగ్ ఆనందం మామూలుగా లేదు. భార్య విగ్ర‌హాన్ని ద‌గ్గ‌ర‌గా వెళ్లి చూసి ముద్దు పెట్టుకున్నాడు. అంతేకాదు.. ఆ విగ్ర‌హాన్ని ఇంటికి తీసుకెళ్లిపోవ‌చ్చా అంటూ స‌ర‌దాగా న‌వ్వుకుంటూ అడిగేసాడు ర‌ణ్‌వీర్ సింగ్. ఆ త‌ర్వాత కూడా భార్య స్టాచ్యూ చూస్తూ ఉండిపోయాడు. ఇక దీపిక కూడా త‌న బొమ్మ‌ను చూసుకుని మురిసిపోయింది. మొత్తానికి బాలీవుడ్ నుంచి మ‌రో సెలెబ్రెటీ మేడ‌మ్ తుస్సాడ్స్ మ్యూజియంలో బొమ్మ‌గా మారిపోయింది.
First published: