• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • DEEPIKA PADUKONE TO PLAY VILLAIN IN A CRAZY SERIES AFTER PRABHAS MOVIE MHN

Deepika Padukone: క్రేజీ సిరీస్‌లో లేడీ విలన్‌గా ప్రభాస్‌ హీరోయిన్‌... గోల్స్ మామూలుగా లేవుగా!

Deepika Padukone: క్రేజీ సిరీస్‌లో లేడీ విలన్‌గా ప్రభాస్‌ హీరోయిన్‌... గోల్స్ మామూలుగా లేవుగా!

Deepika Padukone to play villain in a crazy series after Prabhas movie

Deepika Padukone - Dhoom4: బాలీవుడ్‌ క్రేజీ సిరీస్‌లో ఒకటైన ధూమ్‌ 4లో ఓ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె విలన్‌గా నటిస్తుందని బాలీవుడ్‌ వర్గాల సమాచారం.

  • Share this:
    నిన్న మొన్నటిదాకా ప్రభాస్‌ చేస్తారనుకున్న రోల్‌ను, ఇప్పుడు ఆయన హీరోయిన్‌ ఎగరేసుకుపోయింది. ఫర్వాలేదులే.. డార్లింగ్‌ చేస్తారనుకుంటే... డార్లింగ్‌ పక్కన నటించబోయే స్వీట్‌ డార్లింగ్‌ చేస్తున్నారని సరిపెట్టుకుంటున్నారు రెబల్‌ ఫ్యాన్స్. ఇంతకీ కాబోయే లేడీ డాన్‌ ఎవరా? అని అనుకుంటున్నారా? షి ఈజ్‌ నన్‌ అదర్‌ దేన్‌ క్వీన్‌ డీ. యస్‌ మీ గెస్సింగ్స్ కరెక్టే... దీపిక పదుకోన్‌ త్వరలో విలన్‌గా నటించబోతున్నారు. అదీ యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ తెరకెక్కిస్తున్న సినిమాలో. ధూమ్‌4లో! ధూమ్‌ ఫ్రాంచైజీలో ఎప్పుడూ విలన్‌లకి స్పెషల్‌ ప్లేస్‌మెంట్‌ ఉంటూనే ఉంటుంది. ఫస్ట్ వెర్షన్‌లో జాన్‌ అబ్రహామ్‌ యాక్ట్ చేశారు. సెకండ్‌ వెర్షన్‌లో గ్రీక్‌ గార్డ్ హృతిక్‌ రోషన్‌ హల్‌చల్‌ చేశారు. థర్డ్ వెర్షన్‌ అయితే ఆమిర్‌ఖాన్‌ చేసిన హడావిడి పీక్స్. ఇప్పుడు ఫోర్త్ వెర్షన్‌లో వాళ్లందరినీ మించేలా ప్లాన్‌ చేసింది యష్‌ రాజ్‌ ఫిల్మ్స్.

    ఈ నయా వెర్షన్‌లో విలన్‌ ఛాన్స్ క్వీన్‌ డీకి ఇవ్వాలన్నది మేకర్స్ డెసిషన్‌. బట్‌ ఇప్పుడు దీపిక ఈ రోల్‌ని యాక్సెప్ట్ చేస్తారా? లేదా? ఒకవేళ చేయాలంటే ఆమె ముందున్న హర్డిల్స్ ఏంటి? నటిగా ఆల్రెడీ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్‌ సినిమాలనే సెలక్ట్ చేసుకుంటున్న దీపికకి విలనిజం చేయడంలో పెద్ద కష్టమేమీ ఉండకపోవచ్చు. కానీ కాల్షీట్‌ని ఎలా అడ్జస్ట్ చేస్తారనేదే మెయిన్‌ క్వశ్చన్‌.దీపిక కాల్షీట్‌ అడ్జస్ట్ చేయాలంటే ముందు ఆమె ముందు చాలా సినిమాలే ఉన్నాయి. ఇప్పుడు ఆమె షారుఖ్‌ ఖాన్‌ పఠాన్‌లో యాక్ట్ చేస్తున్నారు. దీనితో పాటు షకున్‌ బాత్రా నెక్స్ట్ మూవీలో సిద్ధాంత్‌ చతుర్వేది, అనన్య పాండేతో కలిసి యాక్ట్ చేస్తున్నారు.

    మరోవైపు ప్రభాస్‌తో ప్యాన్‌ వరల్డ్ సినిమాలోనూ ఈ మే నాయిక. అట్లీ నెక్స్ట్ మూవీకి కూడా దీపికనే కన్సిడర్‌ చేస్తున్నారనే వార్తలున్నాయి. అన్నిటికీ మించి ఆమె చిరకాల వాంఛ... ద్రౌపది సినిమాలో కూడా నటిస్తారనే వార్తలున్నాయి. మరి ఇన్ని సినిమాలకు కాల్షీట్‌ అడ్జస్ట్ చేసి, ధూమ్‌ 4 కోసం ఎలా ప్రిపేర్‌ అవుతారన్నది ఇంట్రస్టింగ్‌ టాపిక్‌ అన్నమాట.
    Published by:Anil
    First published: