Home /News /movies /

DEEPIKA PADUKONE TO ACT WITH PRABHAS FOR NAG ASHWIN SOCIO FANTASY FILM SR

ప్రభాస్‌తో నటించేది ఆమెనట.. హీరోయిన్‌ను ఫైనల్ చేసిన నాగ్ అశ్విన్..

ఇండియాలో ఇప్పుడు ఖర్చులు పెరిగిపోయాయి. అందుకే మన హీరోలు కూడా రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు. ఒకప్పుడు సినిమా 100 కోట్లు వసూలు చేస్తే ఔరా అని ఆశ్చర్యపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు మన హీరోలే 100 కోట్లు వసూలు చేసే స్థాయికి ఎదిగిపోయారు.

ఇండియాలో ఇప్పుడు ఖర్చులు పెరిగిపోయాయి. అందుకే మన హీరోలు కూడా రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు. ఒకప్పుడు సినిమా 100 కోట్లు వసూలు చేస్తే ఔరా అని ఆశ్చర్యపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు మన హీరోలే 100 కోట్లు వసూలు చేసే స్థాయికి ఎదిగిపోయారు.

మహానటితో పాపులరైన నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రభాస్ సోషియో ఫాంటసీ జానర్‌లో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

    ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన.. మహానటితో పాపులరైన నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో సోషియో ఫాంటసీ జానర్‌లో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి సంబందించి అధికారిక ప్రకటన ఆ మధ్య విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ‘జాన్’ చిత్రం పూర్తవగానే మొదలుకానుంది. నాగ్ అశ్విన్ ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించనున్నాడట. అందులో భాగంగా ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. దీంతో ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం హిందీ స్టార్స్ ను తీసుకొవాలని చూస్తున్నాడు నాగ్ అశ్విన్. ఇక ఈ సినిమా అన్ని కుదిరితే డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. సోసియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. సామాన్య మానవుడు, దేవకన్య మధ్య ప్రేమకు గుర్తుగా పుట్టిన ఓ పిల్లాడే హీరో అట. ఇలాంటీ చిత్రంలో సహజంగానే విఎఫ్‌ఎక్స్‌ భారీగా ఉంటాయి. దాంతో అశ్వినీదత్ ఈ చిత్రం విఎఫ్‌ఎక్స్ కోసం ప్రత్యేకంగా 50 కోట్లకు పైగా బడ్జెట్‌ను కేటాయించారట. ఇక ఈ సినిమాలో నటించేందుకు ఇప్పటికే కొంతమందితో ఫోన్ లోనే సంప్రదించినట్లు సమాచారం. అయితే ప్రభాస్ సరసన నటించే హీరోయిన్‌ గానీ, లేదా ఇతర పాత్రలను ఇంకా ఫైనల్ చేయలేదట. అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో ఈ మధ్య వార్తలు బాగా వినిపిస్తున్నాయి.

    ఖచ్చితంగా బాలీవుడ్ హీరోయినే నటిస్తుందనేది ఫిక్సయినప్పటికీ ఆ హీరోయిన్ ఎవరనే విషయంలోనే చర్చలు నడుస్తున్నాయి. అందులో భాగంగా ఈ చిత్రంలో పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకొనే నటిస్తుందని అన్నారు. ఆ తర్వాత మళ్లీ 'ఆర్ఆర్ఆర్' నటి అలియా భట్ అనే వార్తలు వినిపించాయి. అయితే దాదాపు దీపికానే ఫిక్స్ అంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. తాజాగా దీపికా తన సోషల్ మీడియా వేదికగా.. అందరూ 'మహానటి' సినిమా చూడండంటూ పోస్ట్ చేసింది. దీనికి ప్రతి స్పందనగాజజ నాగ్ అశ్విన్ తెల్లవారు జామున కూల్ నోటిఫికేషన్ వచ్చింది.. అంటూ కామెంట్ చేశారు. దీంతో సినీ అభిమానులంతా దీపికానే ప్రభాస్ హీరోయిన్ అంటూ సందడి చేస్తూన్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Nag Ashwin, Prabhas, Prabhas Latest News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు