Deepika Padukone tests Corona positive : దీపికా పదుకొనే...ఈ పేరును తెలుగు వారికి మరోసారి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాజాగా దీపికా ఓ తెలుగు సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాతో దీపికా తెలుగు తెరకు పరిచయం కానుంది. కాగా దీపికా తాజాగా కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆ జాబితాలోకి దీపికా పదుకునే చేరారు. దీపికకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటూ ట్రీట్ మెంట్ కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా వైద్యులు సూచించిన ఔషధాలను ఆమె వాడుతున్నారు. అయితే దీపికకు కరోనాకు సంబంధించి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయట. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు సమాచారం అందుతోంది.ఇక మరోవైపు దీపిక కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. దీంతో ప్రస్తుతం దీపికా ఫ్యామిలీ మొత్తం బెంగళూరులోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇక దీపికా సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం షారుఖ్ ఖాన్ సరసన 'పఠాన్' చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు ఆమె భర్త ప్రధాన పాత్రలో వస్తున్న 83 అనే సినిమాలో దీపికా హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో వస్తుంది. కపిల్ దేవ్ జీవితం ఆదారంగా తెరకెక్కుతోంది. ఇక మరోవైపు, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్న చిత్రంలో ప్రభాస్ సరసన నటించనుంది. ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్టు పనులను జరుపుకుంటోంది. అశ్వనీదత్ నిర్మాత. అమితాబ్ బచ్చన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ అనే సినిమాల్లో బిజీగా ఉన్నారు. దీంతో పాటు ఆయన నటించిన రాధే శ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే సలార్ సినిమా పూర్తవ్వగానే నాగ్ అశ్విన్ సినిమా మొదలు కానుందని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Deepika Padukone, Tollywood news