బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో దీపిక పదుకొనె( Deepika Padukone) ఒకరు. ఓం శాంతి ఓం సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింద. బాలీవుడ్(Bollywood)తో పాటు ఇంగ్లీష్ చిత్రాల్లోనూ ఆమె నటించింది. ప్రముఖ హీరో రణ్వీర్ సింగ్(Ranvir singh)ను ప్రేమించి పెళ్లాడింది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని... బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న దీపికకు ఉన్న మరో టాలెంట్ తాజాగా బయటపడింది. యాక్టింగ్, డ్యాన్స్‌లో దీపికా నెంబర్ వన్. దాంట్లో నో డౌట్. అయితే తాజాగా ఆమెలో దాగిన ఆ కళను నిన్న సోషల్ మీడియా(Social Media) వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. ఇన్నాళ్లూ దాచిన ఆ హిడెన్ టాలెంట్ మరేదో కాదు.. కవిత్వం రాయడం.
దీపిక ఏడో తరగతి చదువుతున్నప్పుడు తొలిసారిగా కవిత రాసింది. క్లాస్ రూంలోనే ‘I AM’ అనే పదాలు ఇచ్చి ఓ కవిత రాయమన్నారట టీచర్. దాంతో ఆ పదాలనే టైటిల్‌గా పెట్టి మూడు పేరాల కవిత రాసింది దీపిక(Deepika). ఐయామ్ లవ్ అండ్ కేర్ ఉన్న చిన్నారిని అంటూ మొదలైన ఆ కవితను నిన్న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. పన్నెండేళ్ల వయసులో ఈ కవిత రాసిన దీపిక, తర్వాత తండ్రి బాటలో నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్, ఆ తర్వాత మోడలింగ్, సినిమాలు అంటూ బిజీగా మారింది. అందుకే ఇలా కవిత రాయడం అదే మొదటి, చివరి ప్రయత్నం అని చెప్పింది దీపిక.
అయితే చిన్న వయసులోనే ప్రకృతితో మనకున్న రిలేషన్‌ను తెలియజేస్తూ చక్కని కవిత రాసిన దీపిక, మళ్లీ తన రైటింగ్ టాలెంట్‌పై ఫోకస్ పెట్టాలంటున్నారు అభిమానులు. ఇక ప్రస్తుతం దీపిక చేతిలో సినిమాలో ఫుల్ బిజగా ఉంది. షారుఖాన్(Shahrukh Khan) తో కలిసి పఠాన్ సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు పాన్ ఇండియా స్టార్ బాహుబలి ప్రభాస్(Prabhas)తో కూడా తెలుగులో సినిమా తీస్తోంది. తొలిసారి తెలుగులో ప్రాజెక్ట్ కె సినిమాలో ప్రభాస్ సరసన దీపిక(Deepika) నటిస్టోంది. దీంతో పాటు ఫైటర్ మూవీలో కూడా యాక్ట్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన దీపిక కవిత్వం పోస్ట్ అందరినీ ఆకర్షిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood news, Deepika Padukone, Ranveer Singh, Shahrukh khan