అమీర్‌తో కలిసి తిన్న ఆ పెరుగన్నం ఇంకా మర్చిపోలేదు : దీపికా పదుకొనే..

Deepika Padukone : దీపికా పదుకొనే...ఈ పేరును తెలుగు వారికి మరోసారి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

news18-telugu
Updated: May 18, 2020, 9:00 AM IST
అమీర్‌తో కలిసి తిన్న ఆ పెరుగన్నం ఇంకా మర్చిపోలేదు : దీపికా పదుకొనే..
దీపికా పదుకొనే Photo : Instagram
  • Share this:
Deepika Padukone : దీపికా పదుకొనే...ఈ పేరును తెలుగు వారికి మరోసారి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇంతవరకు తెలుగు సినిమా చేయకపోయినా తన హిందీ సినిమాలతో దేశవ్యాప్తంగా సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది. ఆమె మొదటి సినిమా ఓం శాంతి ఓం నుండి తాజా ఛపాక్ వరకు తన నటనతోనే కాకుండా అందచందాలతో అదరగొడుతోంది. దీపికా ఓ హాలీవుడ్ సినిమా కూడా చేసింది. ఇక రెండు సంవత్సరాల కింద తోటి నటుడు రణ్ వీర్ సింగ్‌తో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. అది అలా ఉంటే దీపికా ఓ 20 ఏళ్ల క్రితం తీసుకున్న ఓ అరుదైన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో హిందీ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూడా ఉన్నాడు. ఆ ఫోటోలో దీపికా తండ్రి ప్రకాశ్ పదుకునే, తల్లి ఉజ్జల, సోదరి అనీశా వరుసగా కూర్చోని ఉన్నారు. ఈ సందర్భంగా దీపికా ఆ పోస్ట్‌లో రాస్తూ.. అప్పట్లో తనకు 13 ఏళ్లు అని ఆమె తెలుపుతూ.. ఆమీర్ ఖాన్‌తో కలిసి పెరుగన్నం తిన్నానని ఆ ఘటన ఇంకా మర్చిపోలేదని తెలిపింది. ఇక దీపికా ప్రస్తుతం తన భర్త రణ్ వీర్ సింగ్‌తో కలసినటిస్తోన్న ‘83’ దాదాపు షూటింగ్ పూర్తిచేసుకుంది. విడుదలకు సిద్ధమవుతోంది.



First published: May 18, 2020, 8:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading