అంత కోపం ఎందుక‌మ్మా.. పెళ్ళిపై దీపిక సీరియ‌స్..!

ఏ అమ్మాయైనా పెళ్లి గురించి సిగ్గు ప‌డుతుంది కానీ దీపిక మాత్రం సిరాకు ప‌డుతుంది. బాలీవుడ్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కొంప‌దీసి ర‌ణ్‌వీర్‌తో కానీ దీపికకు ఏదైనా గొడ‌వ గానీ జ‌రిగిందా ఏంటి అని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈవెంట్‌కు వ‌చ్చిన దీపిక ప‌దుకొనేను పెళ్లి గురించి అడిగారు మీడియా ప్ర‌తినిథులు.

news18-telugu
Updated: September 9, 2018, 4:50 PM IST
అంత కోపం ఎందుక‌మ్మా.. పెళ్ళిపై దీపిక సీరియ‌స్..!
దీపిక పదుకొనే ట్విట్టర్ ఫోటో
  • Share this:
దీపిక ప‌దుకొనే.. ఈ పేరు విన‌గానే మ‌రో పేరు కూడా వెన‌కే వినిపిస్తుంది. అదే ర‌ణ్‌వీర్ సింగ్. కొన్ని రోజులుగా ఈ ఇద్ద‌రూ డేటింగ్‌లో ఉన్నారు. త్వ‌ర‌లోనే పెళ్లి కూడా చేసుకుంటున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. నవంబ‌ర్ 18 అని డేట్ కూడా వ‌చ్చింది. అన్నీ సాఫీగా సాగిపోతున్నాయి. ఈ పెళ్లి కోస‌మే సినిమాలు కూడా చేయ‌డం లేదు ఈ ముద్దుగుమ్మ‌. మ‌రోవైపు ర‌ణ్‌వీర్ సింగ్ కూడా ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. దీపిక‌, ర‌ణ్‌వీర్ పెళ్లి ఇట‌లీలో జ‌ర‌గ‌బోతుంద‌ని తెలుస్తుంది.

deepika padukone
దీపిక పదుకొనే ట్విట్టర్ ఫోటో


అయితే అన్నీ బాగానే ఉన్నా ఇప్పుడు ఈ పెళ్లి టాపిక్‌పై దీపిక స‌డ‌న్‌గా చాలా సీరియ‌స్ అయింది. ఏ అమ్మాయైనా పెళ్లి గురించి సిగ్గు ప‌డుతుంది కానీ దీపిక మాత్రం సిరాకు ప‌డుతుంది. బాలీవుడ్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కొంప‌దీసి ర‌ణ్‌వీర్‌తో కానీ దీపికకు ఏదైనా గొడ‌వ గానీ జ‌రిగిందా ఏంటి అని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈవెంట్‌కు వ‌చ్చిన దీపిక ప‌దుకొనేను పెళ్లి గురించి అడిగారు మీడియా ప్ర‌తినిథులు.
deepika padukone
దీపిక పదుకొనే ట్విట్టర్ ఫోటో

అప్ప‌టి వ‌ర‌కు కూల్‌గానే స‌మాధానాలు చెప్పిన దీపిక‌.. పెళ్లి ప్ర‌శ్న‌కు మాత్రం అంతెత్తున లేచింది. ఇది పూర్తిగా సంస్కారం లేని ప్ర‌శ్న అంటూ సీరియ‌స్ అయింది. అందులో అంత‌గా కోపం తెచ్చుకునేంత విష‌యం ఏంటో దీపిక ప‌దుకొనేకే తెలియాలి మ‌రి. ఎస్ అంటే ఎస్.. నో అంటే నో అని చెప్పాలి కానీ సంస్కారం లేదంటూ తిట్ట‌డ‌మేంట‌ని ఈ భామ‌పై సెటైర్లు పేలుతున్నాయి. పెళ్లి మాట విన‌గానే కోపం వ‌చ్చిందంటే ప‌ర్స‌న‌ల్ అని స‌రిపెట్టుకుందా.. లేదంటే నిజంగానే ఏదైనా తేడా కొడుతుందా..? ఈ ప్ర‌శ్న‌కు మాత్రం దీపిక కాదు కాల‌మే స‌మాధానం చెప్పాలి.
Published by: Praveen Kumar Vadla
First published: September 9, 2018, 4:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading