Bollywood Drug Case: ఎన్సీబీ విచారణకు హాజరైన దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్..

Bollywood Drug Case: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు విచారణలో భాగంగా బాలీవుడ్ డ్రగ్స్ కోణం బయటపడ్డ సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: September 26, 2020, 11:40 AM IST
Bollywood Drug Case: ఎన్సీబీ విచారణకు హాజరైన దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్..
ఎన్సీబీ విచారణకు హాజరైన దీపికా పదుకొనే Photo : Twitter
  • Share this:
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు విచారణలో భాగంగా బాలీవుడ్ డ్రగ్స్ కోణం బయటపడ్డ సంగతి తెలిసిందే. దీంతో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు దర్యాప్తు చేపట్టారు.  ఈ కేసులో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్‌ రియా చక్రబర్తితో పాటు పలువురికి డ్రగ్స్ కేసులో సంబంధాలు ఉన్నాయని తేలింది. ఈ క్రమంలో దీపికాతో  పాటు ప్రముఖ నటీమణులు శ్రద్ధా కపూర్‌, సారా అలీ ఖాన్‌. రకుల్ ప్రీత్ సింగ్‌లతో పాటు ఈ కేసులో సంబంధమున్న వాళ్లకు ఎన్‌సీబీ సమన్లు జారీ చేసింది. అందులో భాగంగా సెప్టెంబర్  26వతేదీన నార్కొటిక్సు కంట్రోల్ బ్యూరో అధికారుల దర్యాప్తునకు దీపికా హాజరైంది. అయితే ఈ కేసులో ఉన్న మరో నటి సారా అలీ ఖాన్ కూడా ఎన్సీబీ విచారణకు వచ్చింది. ఇక సుశాంత్ సింగ్ కేసులో మాదకద్రవ్యాల పాత్ర గురించి ఎన్సీబీ అధికారులు శుక్రవారం దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్, సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ లను ప్రశ్నించారు. మరో సినీనటి శ్రద్ధాకపూర్ కూడా శనివారం ఎన్సీబీ దర్యాప్తునకు హాజరు కానుంది. తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఈ డ్రగ్స్ కేసులో మరో 39 మంది పేర్లు బయటపడ్డట్లు తెలుస్తోంది. ఈ తాజా లిస్ట్‌లో ప్రముఖ నటుల పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది.


ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకుంటున్న దీపికా ఈ విచారణ నిమిత్తం తన భర్త రణ్ వీర్ సింగ్‌తో కలిసి రాత్రి 9.15 గంటల సమయంలో ముంబై విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక సారా అలీ ఖాన్ కూడా గోవాలో ఉండగా.. ఆమె తల్లి అమృతా సింగ్. సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్లతో కలిసి సాయంత్రం 5 గంటలకు ముంబై చేరుకుని జుహులో ఉన్న తన నివాసానికి వెళ్లింది. సారా అలీ ఖాన్ 2018లో వచ్చిన చిత్రం "కేదార్‌నాథ్" లో సుశాంత్ రాజ్‌పుత్ సరసన నటించిన సంగతి తెలిసిందే. ఇక ఆయన మరణానంతరం విచారణలో భాగంగా డ్రగ్స్ కోణం వెలుగులోకి రావడంతో దర్యాప్తు ప్రారంభించిన ఎన్‌సీబీ.. ఇప్పుడు తన దర్యాప్తును విస్తృతం చేస్తూ.. సినీ ప్రముఖులను ప్రశ్నించడానికి పిలుస్తోంది. అందులో భాగంగా దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్‌, సారా అలీ ఖాన్‌లు సెప్టెంబర్ 26 (శనివారం) ఎన్‌సీబీ ముందు హాజరుకానున్నారు. ఇక కేసులో భాగంగా నటీ రకుల్ ప్రీత్ సింగ్, దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్‌ను శుక్రవారం అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.
Published by: Suresh Rachamalla
First published: September 26, 2020, 11:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading