దీపిక ప‌దుకొనే క‌దిలింది.. యాసిడ్ దాడికి రెడీ..

దీపిక ప‌దుకొనే ఏంటి.. యాసిడ్ దాడికి సిద్ధం కావ‌డం ఏంటి అనుకుంటున్నారా..? "ప‌ద్మావ‌తి" త‌ర్వాత 9 నెల‌లుగా మ‌రో సినిమా చేయ‌లేదు దీపిక‌. ఒక్క సినిమాకు కూడా సైన్ చేయ‌లేదు. పెళ్లి కోస‌మే ఈమె సినిమాలు మానేసింద‌నే వార్త‌లు కూడా వినిపించాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 17, 2018, 10:57 PM IST
దీపిక ప‌దుకొనే క‌దిలింది.. యాసిడ్ దాడికి రెడీ..
దీపికా పదుకొణే(ఫైల్ ఫోటో)
  • Share this:
దీపిక ప‌దుకొనే ఏంటి.. యాసిడ్ దాడికి సిద్ధం కావ‌డం ఏంటి అనుకుంటున్నారా..? "ప‌ద్మావ‌తి" త‌ర్వాత 9 నెల‌లుగా మ‌రో సినిమా చేయ‌లేదు దీపిక‌. ఒక్క సినిమాకు కూడా సైన్ చేయ‌లేదు. పెళ్లి కోస‌మే ఈమె సినిమాలు మానేసింద‌నే వార్త‌లు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు మాత్రం చాలా రోజుల త‌ర్వాత ఓ సినిమా ఒప్పుకుంది ఈ ముద్దుగుమ్మ‌. అది కూడా సొంత ప్రొడ‌క్ష‌న్‌లోనే చేయ‌బోతుంది.

దీపిక ప‌దుకొనే క‌దిలింది.. యాసిడ్ దాడికి రెడీ.. deepika padukone ready for laxmi agarwal biopic..
నవ్వులు చిందిస్తోన్న దీపికా పదుకొణే (Image: Viral Bhayani)


అలియాభ‌ట్ తో "రాజీ" సినిమా చేసిన మేఘ‌నా గుల్జ‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతుంది. యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితాన్ని ఆవిష్కరించబోతుంది. లక్ష్మీ పాత్రలో దీపికా పదుకొనే న‌టిస్తుందంటే క‌చ్చితంగా సందేశాత్మ‌క క‌థ‌ను స‌మాజానికి అందిస్తున్న‌ట్లే. ఈ క‌థను రెండేళ్లుగా సిద్ధం చేసుకుంటుంది మేఘనా. లక్ష్మీ అగర్వాల్ పై త‌ను 15 ఏళ్ల వ‌య‌సులో ఉన్న‌పుడు యాసిడ్ దాడి జ‌రిగింది. ఆ త‌ర్వాత చాలా రోజుల పాటు ప్రాణాల‌తో పోరాడి గెలిచింది. బ‌య‌టి ప్ర‌పంచాన్ని చూడ‌టానికి కూడా చాలా ఏళ్లు ప‌ట్టింది.

దీపిక ప‌దుకొనే క‌దిలింది.. యాసిడ్ దాడికి రెడీ.. deepika padukone ready for laxmi agarwal biopic..
రణ్‌వీర్ సింగ్


ఆమె గుండె నిబ్బ‌రానికి మెచ్చి అమెరికా ప్ర‌భుత్వం 2104లో ఇంటర్నేషనల్‌ "ఉమెన్‌ ఆఫ్‌ కరేజ్‌" అవార్డును కూడా ప్ర‌క‌టించింది. ఒబామా స‌తీమ‌ణి మెస్సెల్‌ ఒబామా చేతుల మీదగా ఈ పురస్కారాన్ని అందుకుంది. ఈమె జీవితాన్నే ఇప్పుడు దీపిక తెర‌పై చూపించ‌బోతుంది. అయినా ఈ మ‌ధ్య కాలంలో బయోపిక్ ల‌కు డిమాండ్ బాగా పెరిగిపోయింది. చాలా సంచ‌ల‌న బ‌యోపిక్‌లు ఈ మ‌ధ్య కాలంలో హిందీలో తెర‌కెక్కాయి. ఇప్పుడు ల‌క్ష్మీ అగ‌ర్వాల్ కూడా అలాగే ఉంటుంద‌ని ఊహిస్తున్నారు ప్రేక్ష‌కులు.
Published by: Praveen Kumar Vadla
First published: October 17, 2018, 10:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading